Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎందుకంటే మీ కలలే చాలా కీలకం

image
, బుధవారం, 24 మే 2023 (20:16 IST)
పురాతన ఆయుర్వేద భావనల ప్రకారం యుక్తవయస్సు వచ్చిన అమ్మాయి తన సొంత గుర్తింపుని, తనదైన మార్గాన్ని జీవితంలో ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటుంది. అంతేకాకుండా సమాజంలో తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపును కోరుకునే వయసు అది. అన్నింటికి మించి ఒక చిన్నారి యువతిగా మారే క్షణం అది. ఈ సందర్భంలో ఆ యువతి  విభిన్నమైన మనుషులను చూస్తూ... విభిన్నమైన జీవిత అనుభవాలను పొందుతుంది. తద్వారా గతంలో కన్న కలలు అన్నీ ఆమెకు మరింత స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి. అలాంటి యువతుల కలలు తీరేవిధంగా సరికొత్త విధానానికి జీవం పోసింది ఫారెస్ట్ ఎసెన్షియల్స్. ఇందుకోసం యువతి సెలెక్షన్ ను మొదలుపెట్టింది. ఈ యువతి సెలెక్షన్ ద్వారా దేశవ్యాప్తంగా యువతులు మరియు చిన్నారుల కలలకు మద్దతునిస్తుంది, వారు సమాజంలో మరింత ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు సహాయం చేస్తుంది.
 
ఫారెస్ట్ ఎస్సెన్షియల్స్ వారి సరికొత్త కాన్సెప్ట్ అయినటువంటి యువతి కి 14 ఏళ్ల మలీషా ఖర్వా ప్రతినిధిగా కన్పిస్తుంది. సామాజిక మూస పద్ధతులు, కులాల సంకెళ్లను సవాలు చేసే లక్ష్యంతో దూసుకుపోతోంది కంటెంట్ క్రియేటర్ అయినటువంటి మలీషా. మలీషా తనకు, తన కుటుంబానికి మెరుగైన విద్య మరియు ఆర్థిక స్వాతంత్ర్యంతో కూడిన జీవితం గురించి ఎన్నో కలలను కంది. ఆ కలలను సాకారం చేసుకోవడానికి తన మార్గాన్ని సుగమం చేసుకుంది. ఇప్పుడు ఈ ఇన్షియేటివ్ ద్వారా, ఫారెస్ట్ ఎసెన్షియల్స్ మలీషాకు విద్య అందించడంతో పాటు సాధికారత కల్పించడం, సూపర్ మోడల్ కావాలనే ఆమె కలను సాకారం చేసుకోవడంలో సహాయం చేస్తుంది. మలీషాలానే ఇతర యువతులకు కూడా వారి కలల్ని సాధించే విధంగా అవకాశాలు కల్పించడం, విద్యతో వారికి సాధికారత కల్పించి వారిని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకుంది.
 
యువతి సెలెక్షన్ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత శాతం న్యూఢిల్లీలోని ప్రభుత్వేతర సంస్థ అయిన సింపుల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (SEF)చే నిర్వహించబడుతున్న ప్రాజెక్ట్ పాఠశాలకు విరాళంగా ఇవ్వబడుతుంది. దీనికి ఫారెస్ట్ ఎసెన్షియల్స్ మద్దతు ఇస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎండు నల్ల ద్రాక్షలను రాత్రి నానబెట్టి ఉదయాన్నే పరగడపున తింటే?