ప్రపంచవ్యాప్తంగా హాటెస్ట్ మహిళల స్థానంలో తొలిసారిగా అమెరికా ప్రథమ మహిళ మిషెల్ ఒబామా చోటు సంపాదించింది.
మ్యాక్సిమ్ పత్రిక ప్రపంచవ్యాప్తంగానున్న హాటెస్ట్ మహిళలు ఎవరు అని సర్వే నిర్వహించినప్పుడు అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామాకు 93వ స్థానం వచ్చినట్లు ఆ పత్రిక వెల్లడించింది.
బ్రిటిష్ అంతర్జాతీయ పత్రిక అయిన మ్యాక్సిమ్ విడుదల చేసిన సర్వేతోబాటు మిషెల్ ఫొటోకూడా ప్రచురించడం జరిగింది. ఈ ఫోటో వైట్‌హౌస్‌నుంచి అధికారికంగా విడుదల చేసినది కావడం గమనార్హం.
మ్యాక్సిమ్ పత్రిక... మిషెల్ భర్త, ఒబామాను కూడా ఈ సందర్భంగా ప్రశంసించడం గమనార్హం. ఒబామా అమెరికా అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాషన్ రంగానికి చెందిన నిపుణులు మిషెల్‌ను 'స్టైల్ ఐకాన్'గా కొనియాడారు.