ఆరు నెలలోపు పిల్లలకు బలవంతపు ఆహారం ఇవ్వడం చాలా ఇబ్బందికరమైన పరిణామాలను ఎదుర్కోక తప్పదంటున్నారు వైద్యులు.
కొత్తగా తల్లులైనవవారు తమ పిల్లలకు కనీసం ఆరు నుంచి పది నెలలపాటు తల్లిపాలను పట్టాలని సూచిస్తున్నారు వైద్యులు. కాని ప్రస్తుతం కొంతమంది తల్లులు తమ పిల్లలకు తమ పాలను ఇవ్వకుండా పోతపాలు ఇస్తూ ఐదు నెలలు దాటితే వెంటనే ఆహారం ఇచ్చేందుకు ఎక్కువ ప్రాధాన్యతను చూపిస్తున్నారు. శిశువు ఆరు నెలలలోపున్నంతవరకు వారికి కేవలం పాలనుమాత్రమే ఇవ్వాలంటున్నారు వైద్యులు.
మరికొంతమంది శిశువులకు ఆవుపాలు, గుడ్డు, చేప లేదా ఇతర ఆహార పదార్థాలను ఇచ్చేందకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి ఆహారం శిశువులకు ఇవ్వడంమూలాన వారి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనవని అమెరికన్ కాలేజ్ ఆఫ్ అలర్జీ, ఆస్తమా అండ్ ఇమ్యునాలజీ జరిపిన పరిశోధనల్లో వెల్లడైనట్లు ఆ సంస్థ పరిశోధకులు తెలిపారు.