Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వయసు మళ్ళిన మహిళల్లో ఆ ఉత్సాహం...!

Advertiesment
మహిళలు
, బుధవారం, 20 జనవరి 2010 (18:43 IST)
FILE
మహిళల్లో యవ్వన దశలోంచి మధ్య వయసులోకి వచ్చేసరికి కొందరిలోమునుపటి ఉత్సాహం తగ్గడం సహజమే. వారిలో చురుకుదనం తగ్గి జీవితం పట్ల ఓ విధమైన నిర్లిప్తత చోటు చేసుకుంటుంది.

ప్రధానంగా రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలల్లో (మెనోపాజ్‌) ఇలాంటి స్థితి కనబడుతూ ఉంటుందంటున్నారు గైనకాలజిస్టులు. దీంతో వారిలో శారీరకంగానే కాక మెదడు పనితీరులోను కాస్త మార్పు కొట్టొచ్చినట్లు కనపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనున్న మహిళలు టెస్టోస్టిరాన్‌ స్ప్రే వాడటం వలన నిర్లిప్తత పోయి కొత్త ఉత్సాహం కలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

మధ్యవయస్కులైన మహిళల్లో మెనోపాజ్‌ తర్వాత టెస్టోస్టిరాన్‌ అనే సెక్స్‌ హార్మోన్‌ ఉత్పత్తి తగ్గిపోతుంది. యువతులతో పోల్చినప్పుడు వీరిలో టెస్టోస్టిరాన్‌ సగమే ఉత్పత్తి అవుతుంటుంది. దీంతో మెనోపాజ్‌ తర్వాత కొందరు స్త్రీలు డిమెన్షియా అనే మానసిక రుగ్మతతో బాధపడుతుంటారు. మగవారిలో కంటే మహిళల్లో ఇది రెట్టింపు స్థాయిలో ఉంటుంది. దీనికి ప్రధాన కారణం టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ ఉండాల్సిన స్థాయిలో లేకపోవడమేనంటున్నారు వైద్యులు.
webdunia
FILE


ఇలాంటి పరిస్థితిలో స్త్రీలు, ముఖ్యంగా మెనోపాజ్‌ తర్వాత తమ శరీరంపై ప్రతి రోజూ టెస్టోస్టిరాన్‌ స్ప్రే చల్లుకుంటే, తగ్గిపోయిన ఆ హార్మోన్‌ స్థాయి భర్తీ అయి, వారి మెదడు బాగా పనిచేస్తుందని, యువతుల మాదిరిగా తిరిగి ఆ కార్యక్రమంలో మునుపటి ఉత్సాహంతో పాల్గొంటారంటున్నారు పరిశోధకులు. ఇలా వరుసగా క్రమం తప్పకుండా ఆరు నెలలపాటు ఈ స్ప్రేను ఉపయోగించడంతో మెనోపాజ్‌ తర్వాత కూడా స్త్రీల జీవితంలో మంచి మార్పులు సంభవించడమే కాకుండా గతంలోలాగే రతిక్రియలో పాల్గొని తమ జీవిత భాగస్వామికి మంచి తృప్తినిస్తూ, వారూకూడా తృప్తి పొందుతారంటున్నారు వైద్యులు.

వరుసగా క్రమం తప్పకుండా ఆరు నెలలపాటు టెస్టోస్టిరాన్‌ స్ప్రే వాడిన 45 నుంచి 60 ఏళ్ల వయసున్న పదిమంది ఆరోగ్యవంతులైన మహిళలను శాస్తజ్ఞ్రులు అధ్యయనం చేశారు. టెస్టోస్టిరాన్ స్ప్రే వాడినప్పుడు వారి మెదడు పనితీరు బాగా మెరుగుపడినట్లు శాస్తజ్ఞ్రులు తెలిపారు. మెదడు పనితీరు మెరుగుపడటమే కాకుండా వారిలో ఏదో కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన కూడా పెరిగిందన్నారు. దీంతోపాటు వారిలో జ్ఞాపకశక్తి కూడా బాగానే పెరిగినట్లు కంప్యూటర్‌ పరీక్షల్లో వెల్లడైందని శాస్తజ్ఞ్రులు పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu