రియాల్టీ షోలో మిషేల్ ఒబామా
, శుక్రవారం, 6 నవంబరు 2009 (16:54 IST)
ప్రభుత్వేతర కార్యక్రమాలలో ముందుండే అమెరికా దేశపు ప్రథమ మహిళ మిషేల్ ఒబామా ఓ రియాల్టీ షోలో పాల్గొననున్నారు. దీంతో అమెరికా అధ్యక్షుని సతీమణి తొలిసారిగా రియాల్టీ షోలో పాల్గొనడం ఇదే ప్రథమం.ప్రజలు మెచ్చిన టీవీ సీరియల్ " ఐరన్ సేఫ్ అమెరికా " అనే టీవీ సీరియల్‌లో ఆమె ఓ ప్రముఖ కళాకారిణిగా ప్రజలకు దర్శనమివ్వనున్నారని, బ్రిటిష్ షేఫ్ నిగేలా లాసన్ ఈ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తారని డెయిలీ మెయిల్ తెలిపింది. ఈ రియాల్టీ షోలో మిషేల్ ప్రముఖ షేఫ్‌తో భేటీ కానున్నారు. మిషేల్‌కు చెందిన ఎపిసోడ్‌ను వైట్‍హౌస్‌లో చిత్రీకరించారు. ఈ షో నూతన సంవత్సరంలో ప్రసారం కానుందని డెయిలీ మెయిల్ పేర్కొంది. మిషేల్ ఒబామా ఇటీవల వైట్‌హౌస్‌లో నాటిన కూరగాయలను కూడా ఈ షోలో చిత్రీకరించడం జరిగింది."
ఆరోగ్యకరమైన జీవితం" అనే అంశంపై రూపొందుతున్న ఈ రియాల్టీ షోలో తన నటనను ప్రదర్శించేందుకు ఒప్పుకున్నారని, దీంతో వైట్‌హౌస్‌లో హాలీవుడ్‌కు చెందిన చిత్రాల చిత్రీకరణకు పూనుకుంటారని అక్కడి ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు.