అందమైన, అతి కోమలమైన చేతులంటే ప్రతి ఒక్కరికీ ఇష్టం. ముఖ్యంగా మహిళ్ళల్లో అయితే మరీనూ...అందునా వారితో మాట్లాడేటప్పుడు ముందుగా వారి ముఖం చూసి ఆ తర్వాత వారి చేతులను పరిశీలిస్తుంటారు చాలామంది.
అందమైన మీ చేతులను మరింత అందంగా తీర్చిదిద్దుకోండిలా...
** తొలుత మీరు మీ చేతులను శుభ్రంగా ఉంచుకోండి. ఏదైనా సాఫ్ట్ లోషన్‌తో మీ రెండు చేతులను బాగా కడుక్కోండి. మీ చేతుల్లో ఎక్కడైనా మరకలుంటే, అక్క డ నిమ్మకాయ రసంతో రుద్దండి. అక్కడున్న మరకలు మటుమాయం. ఇలాంటి మరకలను మాయం చేయడానికి నిమ్మకాయ ఎంతో ఉపయోగపడుతుంది.
** మీ చేతులను కడిగిన తర్వాత మంచి మాయిశ్చరైజర్ లేదా క్రీమును చేతులకు అప్లై చేయండి. దీంతో మీ చేతులు మృదువుగా ఉంటాయి.
** ఒక వేళ మీరు నీళ్ళల్లో ఎక్కువ సేపు పని చేసే వారైతే మీ చేతులకు గ్లౌజులు వాడండి. అలాగే మీరు వెంట్రుకలకు గోరింటాకు పెట్టేటప్పుడు కూడా చేతులకు గ్లౌజులు పెట్టుకోండి.
** మీరు తోటల్లో పని చేసే ముందు సబ్బు ముక్కలను మీ గోళ్ళల్లో నింపుకొని గ్లౌజులు ధరించండి.
చేతులకు మాలిష్ చేయండిలా...
** రాత్రి పడుకునే ముందు చేతులకు క్రీమును బాగా మాలిష్ చేయండి. చేతులకు వ్యాయామం చేయండి. 6-7 సార్లు పిడికిళ్ళను బిగించి తెరవండి. దీంతో రక్త ప్రసరణ బాగా జరిగి చేతులు మృదువుగా మారుతాయని వైద్యులు సూచిస్తున్నారు.
** మీ అరచేతులను బాగా చాచి వేళ్ళను చక్కగా ఉంచండి. దీనినికూడా 6-7సార్లు చేయండి.
** ఒక్కొక్క వేలిని చక్కగా నిలబెట్టి సుతిమెత్తగా అదమండి. ఆ తర్వాత మీ అరచేతిని కాసేపు వ్రేలాడదీయండి. మీరు బయట ఎండలో వెళ్ళేటప్పుడు కేవలం ముఖానికి మాత్రమే కాకుండా చేతులకు కూడా సన్ స్క్రీన్ వాడమని వైద్యులు సూచిస్తున్నారు.