Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళామణులకు ప్రత్యేక చట్టాలు

మహిళలకు సంబంధించి దేశీయ చట్టాలు ఏం చెబుతున్నాయి...

Advertiesment
స్త్రీలు

Gulzar Ghouse

, సోమవారం, 8 మార్చి 2010 (11:05 IST)
FILE
స్త్రీలపై దేశంలో నానాటికీ జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు, వారి హక్కులను పరిరక్షించేందుకు గత దశాబ్ద కాలంగా ఎన్నో చట్టాలు రూపుదిద్దుకున్నాయి. అయితే ఈ చట్టాలు సక్రమంగా అమలుకు నోచుకోవడం లేదు. అలా మహిళల కోసం రూపొందించిన చట్టాలు నోచుకుని ఉన్నట్లయితే భారత దేశంలో మహిళల పట్ల వివక్ష మరియు అత్యాచారాలు ఈపాటికే సమసిపోయి ఉండేవి.

కానీ నేటి పురుషాధ్యికత సమాజంలో విశృంఖలమైన పరిస్థితులు ఈ అద్భుత ఆవిష్కరణకు అడ్డుపడుతున్నాయి. అయితే ప్రస్తుతం పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత మేరకు ఈ చట్టాలు అమలుకు నోచుకుంటున్నాయి. భారతీయ చట్ట సభలలోని ప్రతి అంశం కూడా మహిళలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ రూపుదిద్దుకుంటున్నాయి. ఈ విషయమై మహిళలు సంపూర్ణమైన అవగాహనను కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

దేశీయ చట్టాలలోని 14వ అధ్యాయం ద్వారా సమ న్యాయం, అధ్యాయం 15 (3) లో జాతి, ధర్మం, లింగం మరియు జన్మస్థానం తదితరాలను అనుసరించి భేదభావం చూపరాదు. అధ్యాయం 16 (1) ని అనుసరించి సమాజ సేవలో బేధభావం లేకుండా సమానత్వం పాటించాలి. అధ్యాయం 19 (1) లో సమాన రూపంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, స్త్రీ మరియు పురుషులను ప్రాణ, దేహపరమైన అంశాలలో స్వాధీనం చేసుకునేందుకు వారిని వంచించిరాదని అధ్యాయం 21 తెలుపుతోంది.

webdunia
FILE
అలాగే అధ్యాయాలు 23-24 లలో శోషణకు విరుద్ధంగా సమాన రూపంలో అధికార ప్రాప్తి, అధ్యాయాలు 25-28 లలో స్త్రీ-పురుషులిరువురికి సమాన రూపంలో ధార్మిక స్వతంత్ర ప్రాప్తి, అధ్యాయాలు 29-30 ల ద్వారా విద్య మరియు సాంస్కృతిక అధికారం సంప్రాప్తించింది. అధ్యాయం 32లో చట్టసభలలో సేవలపై అధికారం, అధ్యాయం 39 (ఘ) ను అనుసరించి స్త్రీలు పురుషులు చేసే సమానమైన పనికి సమాన వేతనాన్ని పొందే హక్కు, అధ్యాయం 40లో పంచాయతీ రాజ్ వ్యవస్థ 73 మరియు 74 అధికరణాలను అనుసరించి ఆరక్షణ (రిజర్వేషన్) యొక్క వ్యవస్థ, అధ్యాయం 41 ద్వారా పని లేమి, వృద్ధాప్యం, అనారోగ్యం తదితర అసహాయ స్థితిలో సహాయాన్ని పొందే అధికారం కలిగివున్నారు.

అధ్యాయం 42లో మహిళా శిశు సంక్షేమ ప్రాప్తి, అధ్యాయం 33 (క) లో పొందుపరిచిన 84వ అధికరణ ద్వారా లోక్‌సభలో మహిళలకు తగు ప్రాధాన్యత, అధ్యాయం 332 (క) లోని 84వ అధికరణాన్ని అనుసరించి రాష్ట్రాల్లోని శాసనసభల్లో మహిళలకు తగు ప్రాధాన్యతను కల్పించాయి.

చట్టం ఏం చెబుతోంది...
webdunia
FILE

* పనిచేసే చోట స్త్రీ-పురుషులకు సమానమైన వేతనాన్ని ఇవ్వాలి.

* మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు మరియు స్నానాల గదులు ఏర్పాటు చేయాలి.

* ఏ మహిళను కూడా దాస్యభావంతో చూడరాదు.

* బలాత్కారం నుంచి బయటపడేందుకు అవసరమైతే సదరు పురుషుని హత్య చేసే అధికారం మహిళకు ఉందని చట్టం చెబుతోంది.

* వివాహితురాలైన హిందూ మహిళకు తన ధనంపై సర్వాధికారాలు ఉంటాయి. తన ధనాన్ని ఏ విధంగానైనా ఖర్చు పెట్టుకునే అధికారం ఆమెకుంటుంది.

* వరకట్నం తీసుకోవడం లేదా ఇవ్వడం చట్టరీత్యా నేరం అని దేశీయ చట్టాలు చెబుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu