Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గర్భిణీ స్త్రీలకు చిట్కాలు...!

Advertiesment
గర్భిణీ స్త్రీ
, గురువారం, 20 ఆగస్టు 2009 (20:17 IST)
FILE
ప్రతి గర్భిణీ స్త్రీ తన గర్భాన్ని సంరక్షించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటుంది. మీ గర్భం సురక్షితంగా ఉంటే కూడా కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు వైద్యులు.

** గర్భం ధరించిన తొలి నెలలో ప్రతి రోజూ రెండుపూటలా పాలలో కలకండను కలుపుకుని సేవించాలి.

** రెండవ నెలలో గోరువెచ్చని పాలలో శతావరీ చూర్ణం 10 గ్రాములు కలుపుకుని త్రాగాలి.

** మూడవ నెలలో చల్లటిపాలలో ఒక చెంచా నెయ్యి మరియు మూడు చెంచాల తేనె కలుపుకుని సేవించాలి. ఇలా ఎనిమిదవ నెల వరకు చేస్తుండాలంటున్నారు ఆయుర్వేద వైద్యులు.

** నాల్గవ నెలలో పాలలో వెన్న కలుపుకుని సేవించాలి.

** ఐదవ నెలలో మళ్ళీ పాలలో నెయ్యి కలుపుకుని సేవించండి.

** ఆరు మరియు ఏడవ నెలలో మళ్ళీ పాలలో శతావరీ చూర్ణం కలుపుకుని సేవించండి.

** ఎనిమిదవ నెలలో గోధుమ రవ్వను పాలలో కలుపుకుని త్రాగాలి.

** తొమ్మిదవ నెలలో శతావరినుంచి తీసిన నూనెను 50 గ్రాముల చొప్పున ప్రతి మూడవ రోజుకు ఒకసారి ఎనీమా తీసుకోవాలంటున్నారు వైద్యులు.

** మూడవ నెలనుంచి ఎనిమిదవ నెల వరకు రెండు పూటలా పెద్ద చెంచాతో ఆవు నెయ్యిని పాలలో కలుపుకుని సేవించండి.

Share this Story:

Follow Webdunia telugu