ప్రతి గర్భిణీ మహిళ ఆ సమయంలో తన ఆరోగ్యం గురించి తనే పట్టించుకోవాలి. కాస్త ఇబ్బంది తలెత్తినా వైద్యులను సంప్రదించాలి. మీ గర్భం సురక్షితంగా ఉన్నుప్పటికీ కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు వైద్యులు.
** గర్భం ధరించిన తొలి నెలలో కలకండ కలిపిన పాలను ప్రతిరోజూ రెండుపూటలా సేవించాలి.
** రెండవ నెలలో శతావరీ చూర్ణం ప్రతి రోజూ పది గ్రాములు నోట్లో వేసుకుని గోరువెచ్చని పాలను సేవించండి.
** మూడవ నెలలో పాలను చల్లబరచి ఒక చెంచా నెయ్యితోపాటు మూడు చెంచాల తేనెను కలిపి సేవించండి. ఇలా ఎనిమిది నెలలవరకు సేవిస్తుండాలి. నెయ్యి, తేనె సమపాళ్ళల్లో తీసుకుంటే అది ఆరోగ్యానికి హానికరమంటున్నారు వైద్యులు.
** నాలుగవ నెల పూర్తిగా పాలలో వెన్నను కలుపుకుని సేవించాలి.
** ఐదవ నెలలో మళ్ళీ పాలలో తగినంత నెయ్యి కలుపుకుని సేవించాలంటున్నారు వైద్యులు.
** ఆరు, ఏడవ నెలల్లో మళ్ళీ పాలలో శతావరీ చూర్ణం కలుపుకుని సేవించండి.
** ఎనిమిదవ నెలలో గోధుమ రవ్వను పాలలో కలుపుకుని సేవించాలి.
** మూడవ నెలనుంచి ఎనిమిదవ నెలవరకు రెండుపూటలా పాలలో ఆవు నెయ్యిని కలుపుకుని త్రాగాలి.
గర్భస్రావం: గర్భిణీస్త్రీలకు ఏడవ, ఎనిమిదవ నెలలో గర్భస్రావం జరిగే సూచనలుంటాయి. ఇలాంటి లక్షణాలు కనపడితే లోధ్రా, మర్రి జిగురుతో తయారుచేసిన చూర్ణం సమపాళ్ళల్లో తేనెతో కలిపి సేవించాలి. దీంతో ఫలితం ఉంటుందంటున్నారు వైద్యులు.
సూచన: పైన పేర్కొనబడిన చిట్కాలను విశ్లేషకులు సలహామేరకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. కాని ప్రతి గర్భిణీ స్త్రీకి వారి, వారి శారీరక స్థితి వేరువేరుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన చిట్కాలను పాటించేముందు వైద్యుల సలహాలుకూడా తీసుకోవడం చాలా మంచిది అంటున్నారు వైద్యులు.