గర్భనిరోధక పిల్స్‌తో మహిళల ఎముకలకు దెబ్బ!
, సోమవారం, 25 జులై 2011 (17:19 IST)
గర్భ నిరోధక పిల్స్ (మందులు) వాడకంతో మహిళల ఎముకలకు దెబ్బేనని తాజా అధ్యయనంలో తేలింది. గర్భాన్ని నిరోధించే పిల్స్‌ను వాడటం ద్వారా మహిళల శరీరంలోని ఎముకల సాంద్రత తగ్గిపోతుందనే విషయం ఓ స్టడీలో తేలిందని వాషింగ్టన్‌కు చెందిన గ్రూప్ హెల్త్ రీసెర్చ్ ఇన్సిస్టిట్యూట్ (జీహెచ్ఆర్ఐ) సైంటిస్టులు చెబుతున్నారు. గర్భనిరోధక మందులు వాడటం ద్వారా ఎముకల బలం తగ్గి, వయస్సు పెరిగే కొద్ది ఫ్రాక్చర్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని జీహెచ్‌ఆర్ఐ సీనియర్ ఇన్వస్టిగేటర్ డిలియా స్కోలెస్ చెప్పారు. ముఖ్యంగా టీనేజ్ మహిళలు గర్భ నిరోధకాలను వాడకూడదని వైద్యులు సూచిస్తున్నారు. టీనేజ్‌లో అధిక శాతం గర్భ నిరోధక మందులను వాడితే.. వయస్సు పెరిగే కొద్దీ ఎముకల్లో సమస్యలు తలెత్తుతాయట. వయస్సుల వారీగా మహిళల్లో జరిగిన పరిశోధనలో గర్భ నిరోధక మందులు వాడే మహిళల్లో ఎముకలకు సంబంధించిన వ్యాధులు, సమస్యలు అధికంగా ఉన్నాయని తేలింది. అయితే పిల్స్ వాడని మహిళలు ఆరోగ్యంగా ఉన్నారని తాజా అధ్యయనంలో తెలియవచ్చిందని స్కోలెస్ వివరించారు. ఇంకా ఎముకల పటిష్టతకు మహిళలు క్యాల్షియం, డి-విటమిన్ ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. అలాగే బరువు తగ్గే వ్యాయామాలు చేయడం ద్వారా ఎముకలు బలంగా ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు.