Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గర్భ నిరోధక మాత్రలు వాడుతున్నారా...!

Advertiesment
రతిక్రియ
, మంగళవారం, 2 మార్చి 2010 (18:55 IST)
FILE
రతిక్రియకు సంబంధించి కండోమ్ లేదా ఇతర సాధానాలు ఉపయోగించినా ఫలితం లేనప్పుడు లేదా మహిళపట్ల బలాత్కారం లేదా కుటుంబ నియంత్రణ సాధనాలను ఉపయోగించడంలో ఏమరపాటు సంభవిస్తే దానికి 72 గంటలలోపు గర్భాన్ని నిరోధించవచ్చు. దీనినే అనుకోని గర్భ నిరోధం అంటారని వైద్యులు చెపుతున్నారు.

అనుకోని గర్భ నిరోధానికి వాడాల్సిన మందుల గురించి ఇటీవల ప్రకటనలు పెరిగిపోతున్నాయి. గర్భ నిరోధాన్ని పొందాలంటే మూడు సాధనాలను అవలంబించాలి. అవేంటంటే.. లివోనార్జెస్ట్రాన్ మాత్రలు. ఇవి మందుల దుకాణాలలో లభ్యమోతున్నాయి. లివోనార్జెస్ట్రాన్ 1.5 మిల్లీగ్రాముల మాత్రను రతిక్రియలో పాల్గొన్న 72 గంటలలోపు (వీలైతే 12 గంటలలోపు) తీసుకోవాలి. దీంతో వచ్చే గర్భాన్ని నిరోధించవచ్చు.

ఈస్ట్రోజెన్ మరియు ప్రోజేస్టెరాన్ మాత్రలు కూడా గర్భ నిరోధక మాత్రలు. ఇవి మాలా-డీ పేరుతో ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా లభిస్తాయి. మార్కెట్లో లభించే లివోనార్జెస్ట్రాన్ మాత్రలు మరియు మాలా-డీ మాత్రలలో పెద్దగా తేడాలేదు. రతిక్రియలో పాల్గొన్న తర్వాత 72 గంటలలోపు మాలా-డీ మాత్రలను రెండు చొప్పున రెండుసార్లు 12 గంటలలోపు వేసుకోవాలంటున్నారు వైద్యులు. వీటిని వేసుకునే ముందు వైద్యుల సలహా మేరకే ఉపయోగించాల్సివుంటుందంటున్నారు వైద్యులు.

కుటుంబ నియంత్రణకు కాపర్ టీ మరో సాధనం, ఇది కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా లభిస్తుంది. చాలా మంది మహిళలు మార్కెట్లో దొరికే ఖరీదైన గర్భ నిరోధక మాత్రలను కొనలేనివారు మాలా-డీ లేదా కాపర్-టీ మందులను ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పొందవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులలో వీటిని ఉచితంగా అందజేస్తారు.
webdunia
FILE


కాపర్ టీలో ఒక మేలైన విధానంవుంది. అదేంటంటే రతిక్రియ జరిగిన ఐదు రోజుల తర్వాత వరకు దీనిని ఉపయోగించవచ్చు. దీంతో అదే సమయంలో వచ్చే రుతుక్రమంలో ఏర్పడే గర్భాన్ని కాపర్ టీ నిరోధిస్తుంది. మరో నెలలో వచ్చే రుతుక్రమం వరకు దీనిని ఉపయోగించవచ్చంటున్నారు వైద్యులు.

వీటి పనితీరు:

అండాశయంలోంచి బయట ఏర్పడే ప్రక్రియను ఈ బిళ్ళలు బలహీనం చేస్తాయి. దీంతో పూర్తిగా గర్భాన్ని నిరోధిస్తాయి. అయినప్పటికీ ఒకవేళ అండాశయం, శుక్రకణాలు కలిస్తే ఈ బిళ్ళ కారణంగా గర్భాశయపు గోడలలో నిలుచున్న గర్భాన్ని కూడా తొలగించేస్తుంది.

గర్భం నిలిచిపోతే ఈ బిళ్ళలు ఏ మాత్రం పని చేయవు. ఇవి గర్భం ధరించకుండా నిరోధించేందుకే పని చేస్తాయంటున్నారు వైద్యులు. ఈ మాత్రలు గర్భాన్ని విచ్ఛిన్నం చేయలేవు.

గర్భ నిరోధక మాత్రలు ఎవరు తీసుకోకూడదు?

* ఎవరికైతే గుండె జబ్బులుంటాయో అలాంటి వారు ఈ గర్భ నిరోధక మాత్రలు మందులు వాడకూడదు.
* ఎవరిలోనైతే మెదడు లేదా శరీరంలో ఏదైనా భాగంలో రక్తం గడ్డకట్టే జబ్బువుంటుందో
* ఎవరికైతే మైగ్రేన్ జబ్బువుంటుందో
* ఎవరి శరీరంలోనైతే ఎంజైముల కొరత ఉంటుందో
* కాలేయానికి సంబంధించిన వ్యాధివున్నవారు

తరచూ గర్భ నిరోధక మాత్రలు తీసుకుంటుంటే

తరచూ గర్భ నిరోధక మాత్రలు తీసుకుంటుంటే వారిలోని జననాంగాలపై చెడు పరిణామాలు సంభవిస్తాయి.
గర్భ నిరోధక మాత్రలు లేదా మందులు వాడాలనుకుంటే వైద్యుల సలహా మేరకే వాడాలి. లేకుంటే విపరీతమైన పరిణామాలు సంభవిస్తాయంటున్నారు వైద్యులు.

Share this Story:

Follow Webdunia telugu