కండోలిజారైస్ కన్నా హిల్లరీ జీతం 4,700 డాలర్‌లు తక్కువని వైట్‌హౌస్ అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే ... ప్రస్తుతం కండోలిజారైస్ అమెరికా విదేశాంగ శాఖ మంత్రిగా ఉండి 1,91,300 డాలర్ల జీతం తీసుకుంటున్నారు. హిల్లరీ ప్రస్తుతం న్యూయార్క్ సెనేటర్‌గా ఉన్నవిషయం తెలిసిందే. కాగా కొత్తగా ఎన్నికైన ఒబామా ప్రభుత్వంలో వచ్చే ఏడాది ఆమె విదేశాంగమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
గతంలో రైస్ 1,86,600 డాలర్ల వేతనం తీసుకుంటుండగా 2007లో అమెరికా ప్రభుత్వం ఆమె జీతాన్ని 1,91,300 డాలర్లకు పెంచింది. కాని ఆ ప్రభుత్వ నిబంధనల ప్రకారం గతంలో ఉన్న పదవికన్నా ఉన్నత పదవీ బాధ్యతలు చేపడితే, ప్రస్తుతం ఆపదవిలో కొనసాగేవారు తీసుకుంటున్న వేతనం, కొత్తగా పదవీ బాధ్యతలు తీసుకునేవారికి వర్తించదు. కాగా హిల్లరీ న్యూయార్క్ సెనేటర్ నుండి ఏకంగా అమెరికా విదేశాంగ మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో ఆమె వేతనంలో మార్పు ఖచ్చితంగా ఉంటుంది.
దీంతో హీల్లరీకి వేతనం కన్నా పదవే ముఖ్యమన్నమాట. కాగా హీల్లరీ ప్రస్తుతం సెనేటర్‌గా తీసుకుంటున్న జీతంతో పోలిస్తే, విదేశాంగమంత్రిగా గతంలో రైస్ తీసుకున్న1, 86,600డాలర్ల వేతనం ఎక్కువని అధికారులు వెల్లడించారు.