Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐటి పరిశ్రమలో రాజ్యమేలుతున్న మహిళలు

Advertiesment
మహిళ స్పెషల్ ఉమన్ ఐటి రంగం మహిళలు వాల్స్ట్రీట్ జర్నల్ జాబితా ముల్కాయ్ సుసాన్ డెకర్ పద్మశ్రీ వారియర్
, బుధవారం, 12 నవంబరు 2008 (02:33 IST)
ప్రపంచ టెక్నాలజీ పరిశ్రమలలోని అత్యంత శక్తివంతుల ముఖాలన్ని పురుషులకే చెంది ఉంటాయని ఇంతవరకు భావిస్తున్న వారు ప్రస్తుతం తమ అభిప్రాయాలను కాస్త మార్చుకోవలసి ఉంది. ప్రపంచ ఐటీ పరిశ్రమ ఇప్పటికీ పురుషుల ఆధిపత్యంలోనే నడుస్తూ ఉండటం నిజమే కాని ఐటి కోటలోకి ప్రతిభావంతులైన మహిళా మూర్తులు తమ వంతు భాగస్వామ్యాన్ని అందిస్తున్నారు.

తమ కృత నిశ్చయం, ప్రతిభ, దార్శనికతల ద్వారా ప్రపంచ ఐటి పరిశ్రమలో అత్యంత శక్తివంతులైన వారి సరసన మహిళలు ఇప్పుడు సగర్వంగా నిలబడుతున్నారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ ఇటీవలే 2008 సంవత్సరానికి 50 మంది ప్రముఖ మహిళల జాబితాను విడుదల చేసింది. ఈ మహిళల్లో ఏడుగురు ఐటి పరిశ్రమకు చెందినవారే మరి.

టెక్ ప్రపంచంలోని ఈ ఉజ్వల తారలను గురించి క్లుప్తంగా తెలుసుకుందామా..

అన్నే ఎమ్ ముల్కాయ్ - జెరాక్స్ కార్పొరేషన్ సీఈఓ

అత్యంత శక్తివంతులైన టెక్ మహిళల జాబితాలో జెరాక్స్ కార్పొరేషన్ సీఈఓ అన్నే ఎమ్ ముల్కాయ్ అగ్రస్థానం సంపాదించారు. 2001 ఆగస్టులో జెరాక్స్ సంస్థ సీఈఓగా చేరిన ఈమె 2001 జనవరి 1న సంస్థ చైర్మన్‌గా ఎదిగారు. 2002లో దాదాపు కుప్పకూలే స్థాయికి దిగజారిన జిరాక్స్ సంస్థలను ముల్కాయ్ లేపి నిలబెట్టారు. కలర్ ప్రింటింగ్, వాతావరణ అనుకూల సాంకేతికలు, విశిష్టమైన కన్సల్టెంగ్ సేవల విషయంలో ఆమె వినూత్న ఆలోచనలు కలిగి ఉన్నారు.

తన ప్రత్యర్థి సంస్థలైన కేనన్, హెచ్‌పిలతో పోటీ పడేందుకు జెరాక్స్ సంస్థ పరిశోధనాభివృద్ధి బడ్జెట్‌ను ఈమె 1.5 బిలియన్ డాలర్లకు పెంచారు. ఫీల్డ్ సేల్స్ రెప్రజింటేవ్‌గా జిరాక్స్ సంస్థలో 1976లో చేరిన ముల్కాయ్ మానవ వనరుల శాఖ ఉపాధ్యక్షురాలిగా, ఛీఫ్ స్టాఫ్ ఆఫీసర్‌గా, సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చి చివరకు సంస్థ ఛైర్మన్‌గా అత్యున్నత స్థానం చేపట్టారు. వివిధ బాధ్యతల్లో దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, యూరప్, ఆసియా, ఆఫ్రికాలలో ఆమె పనిచేశారు.

న్యూయార్క్ నగరంలోని మేరీమౌంట్ కాలేజీలో ఇంగ్లీష్/జర్నలిజంలలో డిగ్రీ పుచ్చుకున్న అన్నే ప్రస్తుతం జెరాక్స్ సంస్థ ఛైర్మన్‌గానే కాక, కాటలిస్ట్, సిటీ గ్రూప్, ఫుజి జెరాక్స్, టార్గెట్ కార్ప్, వాషింగ్టన్ పోస్ట్ వంటి పలు సంస్థల బోర్డు డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.

ఇంకా ఈ లిస్టులో యాహూ సంస్థ ప్రెసిడెంట్‌ సుసాన్ డెకర్ -13-, జెరాక్స్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ 16, విండోస్ 7 యూజర్ ఇంటర్‌ఫేస్ వ్యవహారాలను చూస్తున్న జూలీ లార్సన్-గ్రీన్, ఒరాకిల్ కార్పొరేషన్ సహ అధ్యక్షురాలు సాఫ్రా ఎ కాజ్ -19-, ఫేస్‌బుక్ సీఓఓ షెరిల్ శాండ్‌బర్గ్,, సిస్కో సిస్టమ్స్ సిటీఓ పద్మశ్రీ వారియర్ తదితర మహిళలు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

భారతీయ ఐటి రంగంలో సుప్రసిద్ధ మహిళగా సిస్కో సిస్టమ్స్ సిటీఓ పద్మశ్రీ వారియర్ ఈ జాబితాలో చోటు చేసుకోవడం గమనార్హం

Share this Story:

Follow Webdunia telugu