గర్భం దాల్చిన అమ్మలకు ఓ మంచి పుస్తకం అందుబాటులో ఉందని చెపుతోంది ప్రియాంకా గాంధీ వధేరా. ఆ మధ్య నటి కరిష్మాకపూర్‌తో కలిసి షెఫాలీ సాబరీ రాసిన "ఇట్స్ ఎ మామ్" పుస్తకాన్ని విడుదల చేసింది ప్రియాంక. తాను అమ్మ అయినప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులను ఇప్పటికీ చెపుతుంటుంది.
" తొలి కాన్పులో నాకు కొడుకు పుట్టినప్పుడు నన్నో రోడ్డు రోలర్ ఢీకొట్టినట్లయింది. ఏదో తెలియని చికాకు. ఏ పుస్తకం చదివినా పిల్లల్ని ఎలా సంరక్షించుకోవాలో ఉంటుంది తప్ప తల్లిలో చెలరేగే ఆందోళన గురించి ఉండదు. దాన్ని ఎలా అధిగమించాలో అర్థంకాదు.
రెండోసారి పాప పుట్టినప్పుడు మాత్రం పూర్వానుభవం వల్ల కాస్తంత ప్రశాంతంగా ఉండగలిగాను" అని తన అనుభవాలను పంచుకుంది ప్రియాంక. షెఫాలీ పుస్తకం మిగిలిన పుస్తకాలకన్నా భిన్నంగా ఉంటుందని, తల్లులకు ఉపయోగపడుతుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.