నేటి ఆధునిక కాలంలో అందానికి మెరుగులు దిద్దుకునేందుకు మగువలే కాదు మగవారూ పోటీపడుతున్నారు. పురుషుల సంగతి అలా ఉంచితే.... రసికప్రియ గ్రంథం ఆధారంగా స్త్రీల శృంగారాలంకరణలు 16గా చెప్పబడ్డాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం...
దంతధావనం
నలుగుపెట్టి స్నానం చేయటం
ఒంటికి పసుపు రాసుకోవటం
వస్త్రధారణ ( చీర- రవిక)
కాళ్లకు పారాణి
శిరోజాలంకరణ ( వాలుజడ, ముడి, కొప్పు మొదలైనవి)
పుష్పాలంకరణ
పాపిడి కుంకుమ
బుగ్గన చుక్క
లలాటతిలకం
గోరింటాకు
తాంబూలం
పునుగుజవ్వాది పరిమళాలు
అధరాల ఎరుపు
కంటికి కాటుక
సర్వాభరణాలంకరణ (మంగళసూత్రం, నల్లపూసలు, మట్టెలు... వివాహితులకే)