Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బఠాణీలు రంగుమారకుండా ఉండాలంటే?

ఎండబెట్టిన అల్లంపొట్టును, ఇలాచి పొట్టు టీ పొడిలో కలుపుకుంటే టీకి మరింత రుచివస్తుంది. గారెల పిండి రుబ్బేటపుడు అందులో కొద్దిగా అన్నం వేసి రుబ్బితే గారెలు కరకరలాడుతాయి. బియ్యంలో మట్టిగడ్డలు ఎక్కువగా ఉంటే కొంచెం ఉప్పును వేసి 10 నిమిషాలు నాననిస్తే మట్టి గ

బఠాణీలు రంగుమారకుండా ఉండాలంటే?
, శుక్రవారం, 1 జూన్ 2018 (12:26 IST)
ఎండబెట్టిన అల్లంపొట్టును, ఇలాచి పొట్టు టీ పొడిలో కలుపుకుంటే టీకి మరింత రుచివస్తుంది. గారెల పిండి రుబ్బేటపుడు అందులో కొద్దిగా అన్నం వేసి రుబ్బితే గారెలు కరకరలాడుతాయి. బియ్యంలో మట్టిగడ్డలు ఎక్కువగా ఉంటే కొంచెం ఉప్పును వేసి 10 నిమిషాలు నాననిస్తే మట్టి గడ్డలు నీళ్ళలో కరిగిపోతాయి. చపాతీ పిండిని కలిపేటప్పుడు అందులో గోరువెచ్చని నీళ్ళు వాడితే చపాతీలు సాఫ్ట్‌గా వస్తాయి.
 
బియ్యంలో పురుగు పట్టకుండా ఉండాలంటే ఆ డబ్బాల్లో కొన్ని కరివేపాకు ఆకులు ఉంచితేచాలు. దోస, పకోడీ లేక జంతికలు కరకరలాడాలంటే వాటిల్లో కొన్ని పాలువేసి కలపాలి. రాగివస్తువులను చింతపండుతో తోమితే అవి బాగా మెరుస్థాయి. బెండకాయలు ఫ్రెష్‌గా ఉండాలంటే వాటి కొనలు తుంటి ప్లాస్టిక్ కవర్లో ఉంచితేచాలు.
 
ఇత్తడి వస్తువులను ముందు ఉప్పునీటితో తోమి ఆ తరువాత మామూలు నీటితో తోమితే బాగా మెరుస్తాయి. వంకాయ ముక్కలు వేసిన నీళ్ళలో రెండు చెంచాల పాలు కలిపితే అవి నల్లగామారవు. కందిపప్పు డబ్బాలో ఎండుకొబ్బరి చిప్పను ఉంచితే పురుగులు పట్టువు. అల్లం ఎక్కువరోజులు నిల్వఉండాలంటే వాటిని తడివస్త్రంలో చుట్టిపెట్టాలి.
 
బెండకాయల జిరుగు తగ్గాలంటే వాటిల్లో కొద్దిగా మజ్జిగ, పెరుగు లేదా నిమ్మరసం వేస్తె జిరుగు తగ్గుతుంది. పచ్చిమిరపకాయలకు గాట్లు వేయించితే అవి పగలవు. బఠాణీలు ఉడికించేటప్పుడు అందులో కొద్దిగా చెక్కర వేస్తె రంగుమారవు. కాలిఫ్లవర్ తరిగిన తరువాత ఉప్పు లేదా వెనిగర్ వేసిన నీటిలో కడిగితే పురుగులు దూరమవుతాయి.
 
గోబిపువ్వు వండేటప్పుడు ఒక చెంచాడు పాలు వేస్తే తెల్లదనం పోదు. బియ్యం కడిగిన నీళ్ళలో తరిగిన పచ్చిఅరటికాయ ముక్కలను 2 నిమిషాల పాటు ఉంచితే నల్లబడవు. నెయ్యి త్వరగా పేరుకుపోకుండా ఉండాలంటే మీగడ కట్టేటప్పుడు కొద్దిగా నీళ్ళు చల్లాలి. ఉడుకుతున్న బంగాలదుంపల రంగు మారకుండా ఉండాలంటే అందులో రెండుచుక్కల నిమ్మరసం వేస్తే మంచిది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పడుకునేముందు పొత్తికడుపుకు నువ్వుల నూనెను రాసుకుంటే....