Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెప్టెంబరు 21 శ్రీమతి మెచ్చుకోలు దినోత్సవం... ఆమెను మెచ్చుకోండి ప్లీజ్...

సెప్టెంబరు 21 శ్రీమతి మెచ్చుకోలు దినోత్సవం... ఆమెను మెచ్చుకోండి ప్లీజ్...
, శనివారం, 20 సెప్టెంబరు 2014 (16:26 IST)
ఆడదే ఆధారం... అతడి కథ ఆడనే ఆరంభం... అని ఓ రచయిత అంటే, ఒకడు ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నా అధఃపాతాళానికి పడిపోవాలన్నా స్త్రీ కారణమని పెద్దలు చెప్పారు. ఇలా ఎటు చూసినా మగవాడి ఉత్తానపతనాలకు మహిళ కేంద్ర బిందువు అని గత అనుభవాలు ఎన్నో చెప్పాయి. ఇవాళ ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతుందంటే దానికి కారణం మహిళామూర్తే అని వేరే చెప్పక్కర్లేదు. 
 
నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునేవరకు కుటుంబ సభ్యుల్లో ఒకరుగా ఉండే స్త్రీ పాత్ర వెలకట్టలేనిదే. అని తెలిసినా చాలామంది పురుషపుంగవులు వారిని గడ్డిపోచ కంటే హీనంగా చూస్తుంటారు. ఇంటెడు చాకిరి చేసి వండి వడ్డించి... అంతా ముగిశాక మిగిలి ఉంటే తాను తిని సంతృప్తి చెందుతుంది శ్రీమతి. ఇలా చెప్పుకుంటూ పోతే... ఆమె తోటిదే కుటుంబ వ్యవస్థ సుందర పయనం సాగిస్తోంది. ఆమె పుట్టింట, మెట్టినింట అహరహం చేసే కృషి ఫలితంగానే ప్రతి మగాడు మగాడిలా ప్రంపంచంలో తలెత్తుక తిరుగుతున్నాడంటే అతిశయోక్తి కాదు.
 
ఈ నేపధ్యంలో ఈ ఏడాది ఆయా కుటుంబాల్లో స్త్రీ మూర్తి చేసిన ఘనమైన పనులను ఒక్కసారి మననం చేసుకుంటూ ఆమెను మెచ్చుకునేందుకు ఓ రోజును కేటాయించారు. అదే సెప్టెంబరు 21. కాబట్టి రేపటి రోజున... ప్రతి ఒక్కరు స్త్రీని మెచ్చుకునేందుకు సమయాన్ని కేటాయించండి. ఆమె మీ జీవితం ఉన్నత దశకు చేరుకునేందుకు తోడునీడై ఉందన్న విషయం తెలియంది కాదు కనుక రేపు ఆమెకు ఆనందకరమైన క్షణాలను మిగిల్చే పనులు ఇకు మీ చేతుల్లోనే... ప్లాన్ చేయండి మరి... హేపీ Wife Appreciation Day.

Share this Story:

Follow Webdunia telugu