ఆఫీస్ టీమ్‌లో మహిళలు ఉండాల్సిందే.. ఇద్దరు మగాళ్లుంటే కష్టమే గురూ... అదే ఇద్దరు ఆడవాళ్లుంటే..?!
పురుషులకు సమానంగా ఆఫీసుల్లో మహిళలు పనిచేస్తున్నారు. ఇది ఒకందుకు మంచి వాతావరాణానికి సంకేతమేనని తాజా అధ్యయనంలో తేలింది. ఒక ఆఫీసులో ఆడవాళ్లు తప్పకుండా పనిచేయాలని, మహిళలున్న చోట వాతావరణం కూల్‌గా అయిపోతుంద
పురుషులకు సమానంగా ఆఫీసుల్లో మహిళలు పనిచేస్తున్నారు. ఇది ఒకందుకు మంచి వాతావరాణానికి సంకేతమేనని తాజా అధ్యయనంలో తేలింది. ఒక ఆఫీసులో ఆడవాళ్లు తప్పకుండా పనిచేయాలని, మహిళలున్న చోట వాతావరణం కూల్‌గా అయిపోతుందని మార్కెటర్లు, మేనేజర్లు, వినియోగదారుల మధ్య నిర్వహించిన సర్వేలో తేలింది. ఇంకా ఒక టీమ్‌లో అందరూ మగాళ్లే ఉంటే కష్టమని.. అదే ఆ టీములో మహిళ ఉంటే ఈజీగా పనైపోతుందని అమెరికాలోని కరోల్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నిర్వహించిన పరిశోధనలో తేలింది.
ఇంకా ఈ పరిశోధనలో తేలిందేమిటంటే..? ఒక టీమ్‌లో ఇద్దరు మగాళ్లు ఉంటే ఏదైనా అంశంపై ఏకాభిప్రాయం కుదరడం అంత సులభం కాదని వెల్లడైంది. అదే ఇద్దరు వ్యక్తులు కలిగిన టీమ్‌లో ఒక మహిళ, ఒక పురుషుడు ఉంటే మాత్రం వారి అభిప్రాయాలు కలవకపోయినా రాజీ కుదురుతుందని పరిశోధకులు తేల్చేశారు. ఇంకా ఒక టీమ్‌లో పురుషులు మాత్రమే ఉన్న టీమ్‌లో ఒకరిపై ఒకరు పరస్పరం ఆధిపత్యం చూపించే ప్రయత్నం చేస్తారే తప్ప రాజీకి రారని తేలింది.
అదే కనుక ఒక మహిళ జోక్యం చేసుకున్న టీమ్‌లో సత్వర నిర్ణయాలు లేదా ప్రత్యామ్నాయ మార్గాలు సులభంగా, స్వల్పకాలంలో కనుగొనడం జరిగినట్లు పరిశోధన వెల్లడించింది. ఇక ఒక టీమ్‌లో ఇద్దరే మహిళలున్నా సానుకూల ఫలితాలే వచ్చాయని, ఇద్దరు స్త్రీలే ఒక టీమ్‌లో పనిచేస్తే భేషజాలకు పోకుండా ఒకరికొకరు సహకరించుకుని పని పూర్తి చేసుకున్నారని పరిశోధకులు వెల్లడించారు. 1,204 మంది విద్యార్థులపై నాలుగు సార్లు, 673 మంది విద్యార్థులపై ఐదుసార్లు నిర్వహించిన ఈ పరిశోధనలో ఈ విషయం రూఢీ అయ్యిందని పరిశోధకులు చెప్తున్నారు.