ప్రచంచ ప్రఖ్యాత పెప్సికో కంపెనీ సిఇఓ ఇంద్రానూయి అత్యంత శక్తివంతమైన సక్సెస్‌పుల్ మహిళలలో ఒకరు. ఆమె అభిప్రాయంలో మహిళలకు ఇల్లు, పనిచేసే చోటు రెండింటా విజయం సాధించడం అసాధ్యం అని అన్నారు. దీనిని ఆమె వ్యక్తిగత జీవితంతో సరిపోల్చి ఏమన్నారంటే.. ‘నేను మంచి ఉద్యోగినిగానే తప్ప, మంచి అమ్మగా మాత్రం వంద శాతం మార్కులు తెచ్చుకోలేకపోయాను. నాకున్న సమయమంతా నా వృత్తికే కేటాయించా.
మా జీవితాలను ఎంత జాగ్రత్తగా ప్రణాళిక వేసుకున్నా తల్లిగా నేను సక్సెస్ అయ్యానో లేదో ఇప్పటికీ అనుమానమే. మా పిల్లలు మంచి అమ్మనని చెబుతారో లేదో నాకు సందేహమే’ అన్నారామె. ఆమె చెప్పిన మాట వందశాతం వాస్తవమే. ఒక స్త్రీ ఇంటి పని, ఇల్లాలి పని, పిల్లల బాధ్యత, ఉద్యోగ బాధ్యత లాంటి ఎన్నో విషయాల్లో కసరత్తు చేయాల్సి వుంటుంది.
పురుషులకు వుండే స్వేచ్ఛ స్త్రీలకు ఉండదు. ఏదో ఒక రంగంలోనే రాణించగలరు. ఎంత చెప్పినా.. ఇంద్రానూయి వంటి శక్తివంతమైన మహిళలు ఈ అవరోధాలన్నింటినీ దాటి విజయపథంలో వున్నారన్న మాట మాత్రం వాస్తవం.