Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వామ్మో.. అమ్మాయిలకు తల్లులే శత్రువులట?!

Advertiesment
Indian girls face violence from mothers: Unicef
, శనివారం, 6 సెప్టెంబరు 2014 (19:09 IST)
భారత్‌లో తల్లీకూతుళ్ళ మధ్య సంబంధాలపై యునిసెఫ్ ఓ అధ్యయనం చేపట్టింది. దాంట్లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అమ్మాయిలకు వారి తల్లులు, సవతి తల్లులే ప్రథమ శత్రువులని నివేదికలో తేలింది.
 
కూతుళ్ళను వారే ఎక్కువగా శారీరకంగా హింసిస్తారట. 15 నుంచి 19 ఏళ్ళ మధ్య వయసు ఉన్నవారిని పరిశీలించగా... 41 శాతం మంది అమ్మాయిలు వారి తల్లులు, సవతి తల్లుల చేతిలోనే అధికంగా భౌతిక హింసకు గురవుతున్నారని తెలిసింది. 
 
18 శాతం మంది బాలికలు వారి తండ్రులు, సవతి తండ్రుల చేతిలో దండనకు గురవుతున్నారట. క్రమశిక్షణ పేరిట ఈ హింస కొనసాగుతోందని యునిసెఫ్ పేర్కొంది. 
 
కాగా, 25 శాతం మంది అమ్మాయిలు వారి సోదరులు, సోదరీమణుల చేతిలో దెబ్బలు తింటున్నారని కూడా ఈ అధ్యయనం ద్వారా వెల్లడైంది. ఇక, వివాహితుల విషయానికొస్తే, 33 శాతం మంది భర్తల చేతిలో హింసకు గురువుతున్నారని, ఒక్క శాతం మంది మాత్రమే అత్తల చేతిలో దెబ్బలు తింటున్నారని నివేదిక చెబుతోంది.

Share this Story:

Follow Webdunia telugu