Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాషింగ్ మెషిన్ ఉందంటారు... కానీ దానిని ఎలా వాడాలో తెలియదు...

Advertiesment
వాషింగ్ మెషిన్ ఉందంటారు... కానీ దానిని ఎలా వాడాలో తెలియదు...
, బుధవారం, 30 జనవరి 2019 (18:56 IST)
ఈ కాలంలో వాషింగ్ మెషిన్ లేని ఇల్లు లేదు. ఏ ఇంట్లో చూసినా ఈ మెషిన్లే కనపడుతున్నాయి. కొందరైతే పేరుకు మాత్రం మా ఇంట్లో కూడా వాషింగ్ మెషిన్ ఉందని చెప్తుంటారు. కానీ దానిని ఎలా వాడాలో వారికి తెలియదు. అలాంటివారికి ఈ చిట్కాలు...
 
1. కరెంట్ డిమ్‌గా ఉన్నప్పుడు వాషింగ్ మెషిన్‌ను ఎంతమాత్రం వాడకూడదు. మెషిన్‌లో పోసే నీరు శుభ్రంగా ఉండాలి. ఉప్పు నీరు పోయకూడదు. లెవల్‌కి మించి నీరు పోయకూడదు. బట్టలు మెషిన్‌లో నుండి తీసినప్పుడు నీరు కొద్దిగా తక్కువవుతుంది. కాబట్టి మళ్ళీ కొంచెం నీరు పోస్తే బట్టలు ఫ్రీగా మూవ్ అవుతాయి. 
 
2. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాతనే మెషిన్‌లోని బట్టలను బయటకు తీయాలి. బట్టలు మెషిన్‌లో వేసే ముందు పెన్నులు, పెన్సిళ్ళు, పిన్నులు, చిల్లర పైసలు జేబుల్లో లేకుండా చూడాలి. 
 
3. కలర్ బట్టలు, తెల్లబట్టలు కలిపి మెషిన్‌లో వేయకూడదు. తెల్లబట్టలు ముందు వేసి అవి తీసిన తరువాత రంగుబట్టలు వేయాలి. మెషిన్ రన్ అయ్యేటప్పుడు మూత తప్పనిసరిగా వేయాలి. లేకపోతే నీళ్ళు పైకి చిమ్మగలవు. మెషిన్ ఎక్కువసేపు కంటిన్యూవస్‌గా వాడకూడదు. బట్టలెక్కువుంటే కాస్త గ్యాప్ ఇచ్చి తిరిగి వాడాలి.
 
4. తెల్లబట్టలు వేసేముందు నీళ్ళల్లో కొద్దిగా నిమ్మరసం పిండితే మురికిపోయి మరింత పరిశుభ్రంగా తయారయి మంచి సువాసనా భరితంగా ఉంటాయి. ఆ నీళ్ళల్లోనే కొంచెం నీలిపొడిని కలిపితే బట్టలు ధనధగమని మెరుస్తాయి.
 
5. సిల్కు బట్టలపై పడ్డ పండ్లరసాల మరకలు పోవాలంటే అమ్మోనియాతో రుద్దాలి. నల్లరంగు బట్టలు ఉతికేటప్పుడు చివరగా కాస్త వెనిగర్ కలిపిన నీళ్ళలో ముంచి తీస్తే అవి మెరుపు పోగొట్టుకోకుండా ఉంటాయి. 
 
6. కాఫీ, టీ బట్టలపై పడిన వెంటనే వేన్నీళ్ళతో కడిగితే మరకలు పడవు. ఎండిపోయిన మరకలకు బోరెక్స్ పొడిని బాగా రుద్ది వేడి నీళ్ళతో ఉతికితే శుభ్రంగా పోతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాలలో జాజికాయ పొడిని కలుపుకుని తాగితే...?