చాలామంది నల్లగా ఉన్నారని తెగ బాఢపడిపోతుంటారు. తెల్లగా మారాలని ఏవేవో క్రీములు, మందులు వాడుతారు. అయినా కూడా ఎలాంటి తేడా కనిపించుదు. అందుకు ఏం చేయాలో తెలియక అసహానానికి లోనవుతారు. అలాంటి వారికి ఈ చిట్కాలు..
ముందుగా ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత పావుకప్పు పాలలో దూదిని ముంచి ఆ దూదిలో ముఖాన్ని మర్దన చేసుకోవాలి. ఇలా 2 నుండి 3 వారాల పాటు చేస్తే.. మీ చర్మం కాంతివంతమవుతుందుని బ్యూటీ నిపుణులు చెబుతున్నారు. అలానే కొబ్బరి బొండాంలోని నీటిని ముఖానికి, మెడకు, చేతులకు రాసుకుని కొన్ని నిమిషాల తరువాత కడుక్కోవాలి. దీంతో నల్లగా ఉన్న చర్మం తెల్లగా మారుతుంది.
2 స్పూన్ల గంధంలో కొద్దిగా బాదం నూనె కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని ఆరిన వెంటనే కడిగేస్తే చర్మం కోమలంగా తయారవుతుంది. ఒక చిన్న టమోటాను తీసుకుని గుజ్జులా చేసుకోవాలి. అందులో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. ఇలా రోజూ చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. నల్లని చర్మం కూడా తెల్లగా తయారవుతుంది.
పుదీనా ఆకులు , నిమ్మరసాల్ని కలిపి ముఖాన్ని పట్టిస్తే మొటిమలు తొలగిపోతాయి. కోడిగుడ్డులోని తెల్లసొనను వారానికి రెండుసార్లు ముఖానికి రాసుకోవడం ద్వారా చర్మం తెలుపుగా మారుతుంది. అంతేకాదు అనాస పండు రసం, పుచ్చకాయ, బొప్పాయి పండ్ల రసాలను కూడా ముఖానికి రాసుకుంటే చర్మం కాంతిలీనుతుంది.