దివ్యాంగుల సంతానం కలిగివున్న మాతృమూర్తుల బాధ తెలిసిందే. దివ్యాంగులుగా కడుపున పుట్టిన కన్నబిడ్డ కోసం వారి బాగోగులు చూసుకుంటూ.. వారికంటూ తమ జీవితాన్ని త్యాగం చేసే త్యాగమూర్తులు ఎందరో వున్నారు. అలాంటి మాతృమూర్తులను సత్కరించే కార్యక్రమం హైదరాబాదులో జరిగింది.
దివ్యాంగులైన సంతానం కోసం నిరంతరం అంకితభావంతో పనిచేసే మాతృమూర్తులను గుర్తించి వారిని సత్కరించే పనిలో పడ్డారు… కోవిద సహృదయ స్థాపకురాలు, మానవతావాద నారీమణి, టాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్, డా. అనూహ్య రెడ్డి. అంతేగాకుండా సత్కారంతో పాటు వారికి తన వంతు సాయం అందించడంలో ఈమె ముందున్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కోవిద సహృదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాతృ శ్రీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం యూసఫ్ గూడ కృష్ణకాంత్ పార్క్‌కు సమీపంలోని సిద్ధార్థ్ కమ్యూనిటి హాల్‌లో ఘనంగా జరిగింది. గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో దివ్యాంగులైన సంతానాన్ని పోషించే.. మాతృమూర్తులకు, ''మాతృ శ్రీ'' అవార్డ్స్‌తో ఉచిత రీతిగా గౌరవించి సత్కరించే, మహోన్నతమైన కార్యక్రమానికి నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూబ్లీ హీల్స్ శాసన సభ్యులు శ్రీ మాగంటి గోపినాథ్ గారు ఐ.ఏ.ఎస్. అధికారిణి శ్రీమతి ఎమ్. బాల లత గారు విచ్చేశారు. జూబ్లీ హిల్స్ కార్పొరేటర్ శ్రీ తలారి మనోహర్, సిద్దార్థ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రెటరీ శ్రీ పొట్లూరి విజయ్ కుమార్, సంఘ సేవికామణి శ్రీమతి సత్యవాణి భారతీయం, జాతీయ అవార్డ్ గ్రహీత శ్రీ ఎమ్. శ్రీనివాసులు, ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, నిర్మాత బెక్కం వేణు గోపాల్, యోగా తెరఫీ గ్రాండ్ మాస్టర్ శ్రీమతి జెస్సీ నాయుడు, యోగా ట్రైనర్ శ్రీమతి వేంగిపురపు పద్మ, ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీ మహిత్ నారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయ౦ చేశారు. ఈ కార్యక్రమాన్ని కోవిద డిజైన్స్ సమర్పించగా – ''వేవ్'' ఈవెంట్ మ్యానేజెర్స్ కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు.
అనూహ్య రెడ్డి ఎవరంటే..?
సితారా లోకాన్ని అందం రంగంరించడం..
శాన్ ఫ్రాన్సిస్కో అమెరికా - ఫ్యాషన్ రంగంలో మాస్టర్ డిగ్రీ పట్టా పొందారు.
ఇంటర్నేషనల్ వండర్ బుక్‌లో ఆమె పేరు సంపాదించుకుంది.
జర్మనీకి చెందిన ఇంటర్నేషనల్ పీస్ యునివర్సిటి డాక్టరేట్‌తో సత్కరించింది.
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దక్షిణ భారత విభాగానికి, వైస్ ప్రెసిడెంట్ హొదాలో పలు సామాజిక సేవలు చేస్తున్నారు.
ఇంకా వొకేషనల్ ఎక్స్ లెన్స్ జాతీయ అవార్డును సైతం అనూహ్య రెడ్డి అందుకున్నారు.