Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్టైల్‌గా కనిపిస్తారు. కానీ, వారి దంతాలు చూస్తే మాత్రం...

స్టైల్‌గా కనిపిస్తారు. కానీ, వారి దంతాలు చూస్తే మాత్రం...
, సోమవారం, 28 జనవరి 2019 (11:57 IST)
వంటసోడా ప్రతీ ఇంట్లో తప్పకుండా ఉంటుంది. ఇది చర్మ సౌందర్యానికి ఎంతగానో దోహదపడుతుంది. వంటసోడాలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, యాంటీ బ్యాక్టీరియా, ఫంగల్ వంటి ఖనిజాలు అధిక మోతాదులో ఉన్నాయి. ఇవి శరీరంలోని వ్యర్థాలు తొలగించడంలో మంచి ఔషధంగా పనిచేస్తాయి. మరి వంటసోడాతో కలిగే ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం...
 
కొందరైతే చూడడానికి చాలా అందంగా, స్టైల్‌గా కనిపిస్తారు. కానీ, వారి దంతాలు చూస్తే మాత్రం పసుపు పచ్చగా ఉంటాయి. దీని కారణంగా బయటకు వెళ్లాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారనే చింతనే అధికంగా ఉంటుంది. అలాంటివారికి ఈ చిట్కా ఎంతో సహాయపడుతుంది.. మరి అదేంటో చూద్దాం..
 
ఓ చిన్న బౌల్ తీసుకుని అందులో కొద్దిగా టూత్ పేస్ట్, 2 స్పూన్ల వంటసోడా వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆపై ఓ చిన్న కాగితం తీసి అందులో ఈ పేస్ట్‌ను వేసి దంతాలకు కాగితాన్ని అతికించుకోవాలి. ఓ 10 నుండి 15 నిమిషాల పాటు అలానే ఉంచి ఆపై శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తే పసుపు పచ్చగా ఉన్న దంతాలు తెల్లగా, ఆకర్షణీయంగా మారుతాయి. 
 
కొందరికి చేతులకు వెండి బ్రేస్‌లెట్ వేసుకునే అలవాటుంటుంది. కానీ, దాన్ని ఎలా శుభ్రం చేయాలో తెలియక సతమతమవుతుంటారు. అలాంటప్పుడు వేనీళ్ళల్లో కొద్దిగా వంటసోడా వేసి కాసేపు మరిగించి ఆపై బ్రేస్‌లెట్ ఆ నీటిలో వేయాలి. ఓ 5 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తరువాత తీస్తే.. పాతగా ఉన్న బ్రేస్‌లెట్ కొత్తగా మారుతుంది.
 
చాలామంది స్త్రీలు కాళ్లకు ఏవేవో ఆయిల్స్ రాస్తుంటారు. ఎందుకని అడిగేతే.. ఈ ఆయిల్స్ రాసుకుంటే.. కాళ్లు మృదువుగా మారుతాయని చెప్తుంటారు. ఇది వాస్తవమే అయితే.. మరి చేతుల సంగతేంటీ.. ఈ ఆయిల్స్ చేతులకు అలానే ఉండిపోతాయి. దాంతో చేతులు చర్మం రంగును కోల్పోయి చూడడానికే విసుగుగా ఉంటాయి.

అందుకు ఏం చేసినా.. ఫలితం కనిపించలేదని బాధపడుతుంటారు.. ఈ చిన్నపాటి చిట్కా.. ఓ చిన్న ప్లేట్లో కొద్దిగా వంటసోడా వేసి సగంగా కట్ చేసిన నిమ్మను అందులో ముంచి.. ఆ నిమ్మతో చేతులను శుభ్రం చేసుకుంటే.. ముందు మీ చేతులు ఎలా ఉన్నాయో అలానే మారుతాయి. ఈ చిట్కాలు పాటించడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నోరూరించే సొరపొట్టు.. ఎలా చేయాలి...?