Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మార్చి 8న మహిళా దినోత్సవం.. మహిళలు రాణించినా.. పురుషాధిక్యం ఏమాత్రం తగ్గలేదే?

మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మహిళా దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా 1911 మార్చి 19న జరుపుకున్నారు. దీని మూలాలు 1909 ఫిబ్రవరి 28న న్యూయార్క్‌ నగరంలో మొదటి జాతీయ మహిళా

మార్చి 8న మహిళా దినోత్సవం.. మహిళలు రాణించినా.. పురుషాధిక్యం ఏమాత్రం తగ్గలేదే?
, మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (18:10 IST)
మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మహిళా దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా 1911 మార్చి 19న జరుపుకున్నారు.  దీని మూలాలు 1909 ఫిబ్రవరి 28న న్యూయార్క్‌ నగరంలో మొదటి జాతీయ మహిళా దినోత్సవం పాటించడంలో వున్నాయి. ఉపాధి వివక్షత, శాంతికొరకు, మహిళల ఓటుహక్కు ప్రాధాన్యతనిస్తూ అప్పట్లో పెద్ద ర్యాలీలు జరిగాయి. ఈ క్రమంలో 1975లో ఐరాస మార్చి 8ని అంతర్జాతీయ మహిళాదినోత్స వంగా పేర్కొంది. ఇందులో భాగంగా ప్రతి ఏటా ఒక ఇతివృత్తాన్ని (థీమ్‌) ఐరాస ప్రకటిస్తుంటుంది. 
 
ఇకపోతే.. ప్రపంచ శ్రమ గంటలలో మహిళలు మూడింట రెండొంతులు పనిచేస్తున్నారు. అయితే ఆదాయం మాత్రం-10 శాతమే. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో గర్భవతులుగా వున్నప్పుడు మహిళల మృతులు భారీగా నమోదవుతున్నాయి. భారతదేశం, చైనాలలో లింగ నిష్పత్తి తగ్గిపోతోంది. దారిద్ర్యం, దురాగతాల్లో మహిళలే బలవుతున్నారు. పురుషులతో సమానంగా హక్కులు, అవకాశాలు కలిగి వున్నామని ప్రపంచంలో ఎక్కడా మహిళలు చెప్పుకునే పరిస్థితి లేదు. 
 
ప్రపంచ ఆస్తిలో వారికి ఒక్క శాతంపైనే హక్కువుంది. ప్రపంచ దేశాధినేతలలో మహిళలు 5 శాతం కంటే తక్కువ సంఖ్యలో ఉంటున్నారు. 13 కోట్లమంది 6-11 ఏళ్ళ గ్రూపు బాలికల్లో పాఠశాలలకు వెళ్ళని వారిలో 60 శాతంమంది బాలికలే. భారత సమాజంలో స్త్రీ, పురుషుల మధ్య అసమానత అన్ని రంగాల్లో వుంటోంది. అది ఆడ శిశువు జన్మించిన నాటి నుండి మహిళ చావువరకు ప్రతిబింబిస్తోంది. కుమారుల కంటే కుమార్తెలను కుటుంబానికి భారంగా పరిగణిస్తున్నారు. 
 
మహిళలు వివక్షకు గురవుతున్నారు. మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇంటా బయటా శ్రమిస్తూనే ఉన్నా మహిళలకు గుర్తింపు లభించట్లేదు. ఆధునికత పెరిగినా.. అన్నీ రంగాల్లో పురుషులకు ధీటుగా రాణించినా.. పురుషాధిక్యం మాత్రం తగ్గలేదు. పట్టణాల్లో పనిచేసే మహిళలు తరచు భద్రతా సమస్యలనెదుర్కొంటూ ఉంటారు. పొరపాటు అవగాహనల కారణంగా, పురుషుల కంటే స్త్రీలు తక్కువ సామర్థ్యం, తక్కువ ఉత్పాదకతతో ఉంటారని భావిస్తుంటారు. యజమానులు, కాంట్రాక్టర్లు, దళారీలు, సహ కార్మికులు, సీనియర్‌ బాస్‌ తదితరులచే మహిళలు లైంగిక దోపిడీకి గురౌతుంటారు. ఇది తక్షణమే నివారించాల్సిన మరో తీవ్రమైన సమస్య. దీన్ని నిరోధించాలంటే కఠినమైన చట్టాలు రావాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒత్తిడికి లోనవుతున్నారా? ఎక్కువ నీరు తాగండి.. సెల్ఫ్ మోటివేషన్ అలవరుచుకోండి..