Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెంగుళూరులో ఫిబ్రవరి 23న 500 మంది మహిళలతో 'లైఫ్... ఎ మిస్టికల్ జర్నీ'

ఈ నెల 23, 25 తేదీల్లో బెంగళూరులో 8వ అంతర్జాతీయ మహిళా సదస్సు జరుగనుంది. ఈ సదస్సుకు "జీవితం: ఓ ఆధ్యాత్మిక ప్రయాణం" అని నామకరణం చేశారు. ఈ సదస్సులో మహిళా ఆర్టిస్టులు, క్రీడాకారుణిలు వివిధ రంగాల్లో నిష్ణాతులైన 500 మంది మహిళా నాయకులు పాల్గొంటున్నారు. ప్రపం

బెంగుళూరులో ఫిబ్రవరి 23న 500 మంది మహిళలతో 'లైఫ్... ఎ మిస్టికల్ జర్నీ'
, మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (22:04 IST)
ఈ నెల 23, 25 తేదీల్లో బెంగళూరులో 8వ అంతర్జాతీయ మహిళా సదస్సు జరుగనుంది. ఈ సదస్సుకు "జీవితం: ఓ ఆధ్యాత్మిక ప్రయాణం" అని నామకరణం చేశారు. ఈ సదస్సులో మహిళా ఆర్టిస్టులు, క్రీడాకారుణిలు వివిధ రంగాల్లో నిష్ణాతులైన 500 మంది మహిళా నాయకులు పాల్గొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళా సాధికారత, మహిళల అభివృద్ధిని కాంక్షిస్తూ ఆ దిశగా ప్రయత్నం చేయడమే సదస్సు ముఖ్య లక్ష్యం.
 
ఈ సదస్సులో ఎస్బీఐ మాజీ చైర్మన్ అరుంధతి భట్టాచార్య, మన్ దేశి బ్యాంక్, మన్ దేశి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు-చైర్మన్ గల సిన్హా, నటి రాణీ ముఖర్జీ, పర్యావరణవేత్త వందనా శివ, నటి మధూ షా, గోవా గవర్నర్ మృదులా సిన్హా, ఫిజిస్ట్ ఆండ్రియానా మెరైస్, కెలానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ మైత్రీ విక్రమసింఘె తమ సందేశాన్ని ఇచ్చేవారిలో వున్నారు. 
 
''శాంతిని నెలకొల్పి ప్రశాంత వాతావరణం కల్పించడంలో మహిళలే ముందువరసలో వుంటారు. ఇందుకోసం మహిళలంతా కలిసి ఒత్తిడి లేని, హింసకు తావులేని సమాజం కోసం పనిచేస్తున్నారు. ఈ సదస్సు శాంతికి, ఐక్యతను చాటిచెపుతూ సందేశాన్నిస్తుంది'' అని సదస్సు చైర్మన్ భానుమతి నరసింహన్ చెప్పారు.
 
వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీన్ని అనుసరించి మహిళా సదస్సు నిర్మితమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు పోషిస్తున్న పాత్ర, వారియొక్క కీలక భూమిక ఈ సదస్సులో చర్చించడం జరుగుతుంది. 2018 సదస్సు లక్ష్యం ఏమిటంటే, శాంతి, సాధికారతతో పాటు ఆధ్యాత్మికత ప్రాముఖ్యత అంశాలపై ఆయా రంగాలకు చెందిన మహిళలు తమ సందేశాలనిస్తారు.
webdunia
 
"సమాజ నిర్మాణంలో మహిళ పాత్ర చాలా కీలకమైనది. సమాజం బలమైనదిగానూ, శాంతియుతంగా వుండేందుకు మహిళల పాత్ర చాలా ప్రాముఖ్యమైనది'' అని సదస్సు నిర్వాహకుల్లో ఒకరైన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు.
 
2005లో జరిగిన సదస్సులో 100 దేశాలకు చెందిన 375 మంది ప్రముఖులు తమ అమూల్యమైన సందేశాలను ఇచ్చారు. ఇందులో 5500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ దేశాల్లో మహిళల హోదాను, అభివృద్ధిని కాంక్షించేందుకు అనుసరించాల్సిన మార్గాలపై చర్చ జరిగింది. అంతేకాదు, మహిళా సాధికారత, అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకుతో కలిసి పనిచేసింది. ఆ సమయంలో ఇరాక్ దేశంలోని వితంతువులకు వృత్తి విద్యా శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది.
 
ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ గిఫ్ట్ ఎ స్మైల్ ప్రాజెక్టుకు అంతర్జాతీయ మహిళా సదస్సు తమ మద్దతు తెలుపుతోంది. భారతదేశంలోని 20 రాష్ట్రాల్లోని 435 ఉచిత పాఠశాల్లో 58,000 మంది విద్యార్థులు ప్రస్తుతం దీన్ని అభ్యసిస్తున్నారు. ఉత్సాహకరమైన విషయం ఏమిటంటే, 48 శాతం బాలికలు దీన్ని ఎంతో ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు. కాగా 90 శాతం మంది మొదటితరం అభ్యాసకులుగా వున్నారు. బాలికలు విద్యను అభ్యసించేవిధంగా తగు కార్యక్రమాలను నిర్వహించడమే సదస్సు లక్ష్యాలలో ఒకటి.
 
బహిరంగ ప్రదేశాల్లో మలమూత్రాల విసర్జన లేని జిల్లాలుగా వుండాలన్నదానిపై సదస్సు ఈ ఏడాది దృష్టి పెడుతోంది. మొదటి దశలో, బహిరంగంగా మలమూత్ర విసర్జన వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, మరుగుదొడ్లు ప్రాముఖ్యతను గురించి వివరించడం జరుగుతుంది. రెండో దశలో దేశ వ్యాప్తంగా 4000 మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతుంది. ఇవేకాకుండా దారిద్ర్యరేఖకు దిగువన వున్న పేదవారికి ఇళ్లు నిర్మించి ఇవ్వడం, పర్యావరణ పరిరక్షణ, మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టడం, మహిళల సాధికారత కోసం కృషిలో భాగంగా వారిని వివిధ రంగాల్లో నైపుణ్యులుగా తీర్చిదిద్దడం జరుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శృంగారంలో విఫలం... ఏదేదో తినేబదులు ఇవి తింటే చాలు...