Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళలపై లైంగిక వేధింపులకు నో బ్రేక్: ఫిర్యాదు చేసేందుకు జడుసుకుంటున్న 70శాతం ఉద్యోగినులు..?

మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అట్టహాసంగా జరుపుకునేందుకు మహిళలు సన్నద్ధమవుతున్నారు. అయితే మహిళలపై అత్యాచారాలు, దురాగతాలు ఏమాత్రం తగ్గట్లేదనే వార్త వెలుగులోకి వచ్చింది. దేశంలో 2012 ఢిల్

Advertiesment
working women
, శనివారం, 4 మార్చి 2017 (16:40 IST)
మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అట్టహాసంగా జరుపుకునేందుకు మహిళలు సన్నద్ధమవుతున్నారు. అయితే మహిళలపై అత్యాచారాలు, దురాగతాలు ఏమాత్రం తగ్గట్లేదనే వార్త వెలుగులోకి వచ్చింది. దేశంలో 2012 ఢిల్లీ గ్యాంగ్‌ రేప్‌ తరువాత లైంగిక వేధింపుల నిరోధకచట్టాన్నికేంద్రం తీసుకొచ్చింది.

మానవ వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలంటే ముఖ్యంగా ఉద్యోగినుల్లో భద్రతా భావం పెరగాలని ఫిక్కీ లాంటి సంస్థలు గతంలోనే సూచించాయి. అలాగే పనిచేసే చోట లైంగిక వేధింపుల్ని అరికట్టేందుకు కొన్ని నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే.
 
అయితే ఉద్యోగినులు కార్యాలయాల్లో లైంగిక వేధింపులకు గురవుతున్నారని.. అయితే కార్యాలయాల్లో లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు సగానికిపైగా ఉద్యోగినులు ముందుకు రావట్లేదని ఓ సర్వేలో తేలింది. పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం-2013 అమల్లోకి వచ్చినా.. దేశవ్యాప్తంగా లైంగిక వేధింపులు ఏమాత్రం తగ్గట్లేదని చెప్తున్నారు. అయితే ఈ లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసిన తర్వాత తదనంతర పరిణామాలకు భయపడి 70శాతం మహిళలు ఫిర్యాదు చేయడంలేదని ది ఇండియన్‌ బార్‌ అసోసియేషన్‌ 2017లో నిర్వహించిన సర్వేలో తెలిసింది.
 
ఓ వైపు మారుతున్న ఆర్థిక అవసరాల కారణంగా మహిళలు సైతం పురుషులకు సమానంగా ఉద్యోగాలు చేయాల్సి పరిస్థితి. దీంతో ఉద్యోగినుల సంఖ్య పెరగడంతో పాటు వారిపై లైంగిక వేధింపులు కూడా అమాంతం పెరిగిపోతున్నాయని సర్వేలో వెల్లడైంది. యజమానులు, అధికారులు, తోటి ఉద్యోగులు వారిని లైంగికంగా హింసిస్తున్నారని.. అయితే వాటిని దిగమింగుకుని ఎంతోమంది మహిళలు ఫిర్యాదు చేసేందుకు జడుసుకుంటున్నారని సర్వేలో వెల్లడైంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండియన్ ఐటీ యువతపై ట్రంప్ దెబ్బ మీద దెబ్బ... అమెరికా ఆశలు శుద్ధ దండగేనా?