Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రమకు తగిన ఫలితం.. ఈ అవార్డు: ఝలన్ గోస్వామి

Advertiesment
ఆమె ఓ మారు మూల గ్రామానికి చెందిన క్రీడాకారిణి. నేడు.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా బంతులు విసరగలిగే మహిళా బౌలర్‌గా
కోల్‌కతా (ఏజెన్సీ) , బుధవారం, 12 సెప్టెంబరు 2007 (15:40 IST)
ఆమె ఓ మారు మూల గ్రామానికి చెందిన క్రీడాకారిణి. నేడు.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా బంతులు విసరగలిగే మహిళా బౌలర్‌గా గుర్తింపు పొందింది. ఆమే.. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన ఝులన్ గోస్వామి. తాజాగా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రకటించిన 'మహిళా క్రికెటర్ అవార్డు'ను సొంతం చేసుకుంది. ఈ అవార్డును అందుకున్న తొలి మహిళా క్రికెటర్‌గా ఝులన్ రికార్డు పుటలకెక్కింది.

ఈ అవార్డు ఎంపికయ్యే స్థాయికి ఝులన్ ఎదిగారంటే.. ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలు, వేధింపులు భరించింది. చివరకు తాను అనుకున్న లక్ష్యాన్ని చేధించి, ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా (గంటకు 120 కిమీ) బంతులు విసిరే మహిళా క్రికెటర్‌గా పేరుగాంచారు. ఈ స్థాయికి చేరుకోవడం వెనుక నిరంతర శ్రమ, అకుంఠిత దీక్ష ఉంది.

దీనిపై ఝులన్ మాట్లాడుతూ.. నా కల ఫలించింది. నేను పడిన శ్రమకు ఫలితం దక్కింది. క్రికెట్ పాఠాలు నేర్చుకునే రోజుల్లో ఎన్నో ఒడిదుకులు ఎదుర్కొన్నాను. చిన్నపుడు వీధుల్లో ఆడే మగపిల్లలతో క్రికెట్ ఆడేదాన్ని. వాళ్లు నన్ను ఎన్నో రకాలుగా అవమాన పరిచేవారు. వారి మాటలనే పంతంగా స్వీకరించాను. కష్టపడి బౌలింగ్ సాధన చేశా. ఆ ఫలితమే.. నేను ఈ స్థాయికి ఎదిగ గలిగాను.

మా తల్లిదండ్లులకు పూర్తిగా ఇష్టం లేదు. బుద్ధిగా చదువుకోమనేవారు. అయితే.. నా కోచ్ వచ్చి అమ్మనాన్నలకు సర్ది చెప్పారు. అలా ప్రారంభమైన క్రికెట్ ప్రయాణం.. భారత మహిళల క్రికెట్‌లో ఓ సభ్యురాలిగా ఎంపికయ్యే స్థాయికి ఎదిగాను. క్రికెట్ ప్రాక్టీసు కోసం పదుల కిలోమీటర్లు ప్రయాణించేదాన్ని. రోజంతా కష్టపడి, అతి తక్కువ సమయం మాత్రమే విశ్రాంతి తీసుకునేదాన్ని. ఆ శ్రమే.. ఈ రోజు నన్నింత ఉన్నత స్థాయికి చేర్చింది.

చెన్నైలోని ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్, ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్జజం డెన్నీస్ లిల్లీ తదితర నిపుణులు ఇచ్చిన సలహాలు నా కెరీర్‌కు ఎంతో ఉపయోగడ్డాయని ఝునల్ అంటోంది. మొత్తం.. 5'.11 అడుగుల పొడవున్న ఝులన్ కుడిచేతి మీడియం పేస్ బౌలరే కాదు.. ఆల్‌ రౌండర్ కూడా. ఆల్ ది బెస్ట్ ఝులన్.

Share this Story:

Follow Webdunia telugu