శిశువుకు తల్లిపాలు తప్పనిసరి
, సోమవారం, 18 జనవరి 2010 (19:15 IST)
తల్లి ఆరోగ్యంగా ఉంటే శిశువు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలాంటప్పుడు శిశువుకు తల్లిపాలు తప్పనిసరిగా పట్టాలంటున్నారు వైద్యులు. కాని కొందరు తల్లులు బుడ్డీ పాలు ఇస్తుంటారు. అందునా ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న పాల ప్యాకెట్లనే పిల్లలకు ఇస్తున్నారు. పాల ప్యాకెట్లలో వస్తున్న పాలను శిశువులకు ఇస్తే అందులో పోషక పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయని, అవి పిల్లలకు అంత మంచిది కాదంటున్నారు వైద్యులు. పాల ప్యాకెట్లకు బదులుగా ఆవు, ఎనుము(గేదె), మేక పాలును ఇస్తే శిశువు ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. శిశువుకు తల్లిపాల తర్వాత ఆవు పాలు అత్యుత్తమమైన ఆహారం. ఆవుపాలు శిశువుకు చాలా త్వరగా జీర్ణమౌతుంది. ఇందులోనున్న గుణాలు తల్లిపాలలోనున్నట్లే ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి తల్లులు తమ శిశువులకు స్వయంగా పాలను పట్టలేని పక్షంలో ఆవు పాలను మాత్రమే వాడాలంటున్నారు వైద్యులు.