Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళల్లో కామశక్తిని పెంచే రెడ్ వైన్

Advertiesment
మహిళలు
మహిళలు రెడ్‌ వైన్ సేవిస్తే వారిలో కామశక్తి పెరుగుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

మహిళల్లో ఎవరైతే రెడ్‌ వైన్ సేవిస్తుంటారో వారిలో సెక్స్ కోరికలు మరింతగా పెరుతాయని, ఇది సాధారణ మహిళలకన్నా రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధనల్లో తేలినట్లు లండన్‌లోని ఇతాలవీకి చెందిన వైద్యులు తెలిపినట్లు జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ పత్రిక వెల్లడించింది.

శరీరంలోని ప్రధాన భాగాలకు రక్తం సరఫరా జరిగే సమయంలో రెడ్ వైన్ సేవించే మహిళల్లో సెక్స్ కోరికలు పెరిగినట్లు గత వారం విడుదలైన ఆ పత్రిక తెలిపింది.

ఇదిలావుండగా తాము చేసిన పరిశోధనల్లో ఇంకా లోతుగా పరిశోధించాలని వైద్యులు తెలిపినట్లు డైలీ టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది. ప్రముఖ ఫ్లోరెంస్ విశ్వవిద్యాలయానికి చెందిన వైద్యులు పరిశోధనకోసం 18 నుంచి 50 సంవత్సరాల వయసు కలిగిన మహిళలను ఎంచుకుని వారిపై పరిశోధనలు చేశారని ఆ పత్రిక వెల్లడించింది.

కాగా వీరు చేసిన పరిశోధనల్లోకూడా రెడ్ వైన్ సేవించిన మహిళల్లో సెక్స్ కోరికలు బలీయంగా ఉన్నాయని వారి తాజా అధ్యయనంలో వెల్లడైనట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu