మహిళలను వేధించే తలనొప్పికి...
, శుక్రవారం, 12 ఫిబ్రవరి 2010 (18:09 IST)
మహిళలను తరచూ వేధించే తలనొప్పికి ఆయర్వేదంలో మంచి ఔషధాలున్నాయంటున్నారు వైద్యులు. వీరిలో తరచూ వచ్చే తలనొప్పికి చాలానే కారణాలుంటాయంటున్నారు ఆయుర్వేద వైద్యులు. అవి నెలసరి సరిగా జరగకపోవడం, ప్రసవ సమయంలో అసౌకర్యంగా అనిపించడం లేదా గర్భాశయంలో వికారమనిపించడం తదితర కారణాలతో వీరిలో తరచూ తలనొప్పి వస్తుందంటున్నారు వైద్యులు. చికిత్సా విధానం...
మహిళలు తరచూ తలనొప్పితో బాధపడుతుంటే రెండు పూటలా భోజనానంతరం అరకప్పు నీటిలో టానిక్ ఎఫ్-22 లేదా సుందరీ సంజీవనీ కలుపుకుని సేవించండి. ఉదయం సాయంత్రం పాలతోపాటు అశోల్ మాత్రలను రెండు పూటలా సేవించండి. ఇలా వరుసగా 3-4 నెలల పాటు నియమానుసారం వాడుతుంటే తలనొప్పి మటుమాయమంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.