Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మద్యం తీసుకోవడంలోనూ మహిళలే ఫస్ట్...!

మహిళలు మహరాణులు...

మద్యం తీసుకోవడంలోనూ మహిళలే ఫస్ట్...!

Gulzar Ghouse

ప్రస్తుతం మహిళలు అన్ని రంగాలలోనూ రాణిస్తున్నారు. ఎంతటి కష్టతరమైన ఉద్యోగాల్లోనైనా కూడా వారు తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. పురుషులకు ఏ మాత్రం తీసిపోమంటున్నారు నేటి మహిళలు. కాని ఇక్కడ ఒక విషయంలోమాత్రం వారే ముందుంటున్నారు. అదేంటంటే...మహిళామణులు ఇప్పుడు మద్యపానం తీసుకోవడంలోకూడా తమదే పైచేయి అని బ్రిటన్‌లోని మహిళలు వెలుగెత్తి చాటుతున్నట్లు అక్కడ జరిగిన ఓ సర్వేలో తేలింది.

గత దశాబ్ద కాలంగా అక్కడి మహిళామణులు మద్యపానం తీసుకోవడంలో రెండింతలు పెరిగినట్లు సర్వేలో తెలిసింది. ప్రస్తుతం అక్కడ దాదాపు ప్రతిరోజూ 30 లక్షల మంది మహిళలు మద్యపానం సేవిస్తున్నారట. 16 సంవత్సరాలు దాటిన ప్రతి ఆరుగురిలో ఒకరు ప్రతి రోజూ...ఆరు యూనిట్లకు తక్కువ లేకుండా మద్యం సేవిస్తున్నారు. అది వారికి సూచించిన మూడు యూనిట్లకన్నాకూడా ఎక్కువేనంటున్నారు సర్వే నిర్వాహకులు.

రోజు రోజుకు మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యంతోబాటు సాలోచనా దృక్పథం కారణంగా ఒత్తిడిని తట్టుకోవడానికి, ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి వారు మద్యపానం సేవిస్తున్నట్లు సమాచారం. ఏదిఏమైనప్పటికీ మహిళలకన్నాకూడా పురుషులే అధికంగా మద్యం సేవిస్తున్నారు.

పురుషులు ప్రతిరోజూ 23 యూనిట్ల మద్యాన్ని సేవిస్తున్నారు. ఇది వారి సామర్థ్యానికన్నా మించిందేనని "ది టైమ్స్" పత్రిక ప్రకటించింది. 1998 నుంచి 2006 సంవత్సరం మధ్యలో మద్యపానం తీసుకునే మహిళల సంఖ్య రెండింతలు పెరిగిందని పరిశోధకులు తెలిపారు.

ఇదిలావుండగా 2000వ సంవత్సరం తర్వాత 16 నుంచి 24 సంవత్సరాల మధ్యనున్న పురుషుల్లో మద్యపానం తీసుకునేవారి సంఖ్య 10శాతం తగ్గినట్లు సర్వేలు చెబుతున్నాయి.

కాగా గత కొద్ది సంవత్సరాలుగా మద్యపానం త్రాగేందుకు యువకులలో ఉత్సాహం సన్నగిల్లిందని, అదే మధ్యవయస్కులు, వయసు పైబడినవారిలో మద్యపానం తీసుకోవడం అధికంగా ఉందని ఆక్స్‌ఫర్డ్ బ్రూక్స్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ పరిశోధకులు లేస్లీ స్మిత్ వెల్లడించారు. అయితే ప్రధానంగా మహిళలే అధికంగా మద్యపానం త్రాగేందుకు ఉత్సుకత చూపిస్తున్నట్లు వారి సర్వేలో తేలినట్లు ఆయన తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu