Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పూల మొక్కలను పెంచుతున్నారా...?

Advertiesment
పూల మొక్కలు బంతి చేమంతి మల్లె లిల్లీ ఫ్లవర్ వేజ్
, సోమవారం, 4 ఫిబ్రవరి 2008 (17:43 IST)
సాధారణంగా మనం పూలచెట్లను అందం, పరిమళంకోసం పెంచుతుంటాం. ఇంటిముందు ఎక్కువ స్థలం ఉన్నవారు ఓ చిన్న మోస్తరు పూదోటను పెంచితే, ఫ్లాట్స్‌లో నివశించేవారు తమకు లభ్యమయ్యే ప్రదేశంలో పూలకుండీలు పెట్టి పుష్పాలను పూయిస్తారు. రకరకాల రంగులతో పుష్పించే ఆ పుష్పాలలో కొన్నింటిని జడలో తురుముకుని మురిసిపోయే స్త్రీలు, మిగిలిన పూలను ఇదివరకిటిలా అలా వాటిని వదలివేయక తమ ఇంట్లో అలంకరించి, ఇంటికి కొత్త అందాలను చేకూర్చే ప్రయత్నం చేస్తుంటారు.

కన్నులకింపైన పుష్పాలను పుష్పించే మొక్కలను ఎంచుకుని పెంచటం ఒక కళ అయితే... అలా పుష్పించిన ఫ్లవర్ వేజ్ లో చూపులను ఆకట్టుకునేట్లు అలంకరించటం ఓ కళ. పూలతో ఇంటిని అలంకరించాలనుకోవాలనుకుంటే మొదటగా పుష్పించే మొక్కలను గురించి తెలుసుకోవటం అత్యంత అవసరం.
పూల మొక్కలు పెంచేవారికి సూచనలు...
  పూలకోసం మొక్కలను పెంచేముందు అవి పుష్పించే సీజన్లను దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా సీజన్లను దృష్టిలో పెట్టుకుని మొక్కలను పెంచటంవల్ల సంవత్సరం పొడవునా పుష్పాలు లభ్యమయ్యే అవకాశం ఉంది.      


పుష్పించే మొక్కలను గమనించినప్పుడు, కొన్ని ఓ ప్రత్యేకమైన సీజన్ లో మాత్రమే పుష్పిస్తే... కొన్ని ప్రత్యేకమైన సీజన్‌లో మాత్రమే పుష్పిస్తే, మరికొన్ని సంవత్సరానికి రెండుసార్లు, ఇంకొన్ని సంవత్సరం పొడవునా పుష్పిస్తూనే ఉంటాయి. అదేవిధంగా పరిసర వాతావరణం, నేల స్వభావాన్ని బట్టి పుష్పించే మొక్కల పెరుగుదల ఉంటుంది.

పూలకోసం మొక్కలను పెంచేముందు అవి పుష్పించే సీజన్లను దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా సీజన్లను దృష్టిలో పెట్టుకుని మొక్కలను పెంచటంవల్ల సంవత్సరం పొడవునా పుష్పాలు లభ్యమయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు ఎండాకాలంలో పుష్పించే మల్లె, సన్నజాజి, చామంతి, రోజా, సంపెంగ... వానాకాలంలో పుష్పించే టైగర్ లిల్లీ, వెరోనికా... చలికాలంలో పుష్పించే బంతి, డిసెంబరు పూలు, నందివర్థనం, రోజ్ మేరీ వంటి పుష్పాలను పెంచటం వల్ల సంవత్సరం పొడవునా పుష్పాలు లభ్యమయ్యే అవకాశం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu