Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిరంతర ఆనందానికి నిత్య కొలమానాలు

ఆనందం పరిస్థితులు మహిళలు,

Advertiesment
మనసు ఉల్లాసంగా పూలు

WD

, ఆదివారం, 3 జూన్ 2007 (18:23 IST)
ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే నిరంతరం ఆనందంగా వుండే స్థితినే ఫీల్‌ గుడ్‌ అంటున్నారు. అయితే నిరంతరం ఆనందంగా ఉండటం అంత తేలిక కాదు. అందుకు ఈ కింది అంశాలలో సాధన ఎంతైనా అవసరం.

1. ప్రతిరోజూ వ్యాయామం చేయటం, మనసుకు తగిన విశ్రాంతి నివ్వటం ద్వారా సానుకూలంగా ఆలోచించటానికి మనసు ఉద్యుక్తురాలవుతుంది.
2. చేసే పని ఏదైనా సరే దాన్ని ప్రేమించాలి. అప్పుడే చేసే పనిలో సంతృప్తి కలుగుతుంది. దాంతో సద్బావన పెంపొంది ఉన్నత స్థానాలకు ఎదిగే అవకాశం వుంటుంది.
3. ఎప్పుడూ ఉల్లాసంగా ఉండటాన్ని ఒక హాబీగా అలవాటు చేసుకోవాలి. రంగు రంగుల పూలు, రివ్వున ఎగిరే పక్షులు, సమ్మోహితులను చేసే ఉదయకాల సూర్యకాంతి కిరణాలు... ఇలా పకృతి అంతటా ఆనందానికి అభివ్యక్తాలే. వాటిని అనుభూతి చెందండి.
4. ఇతరులకు కావాల్సిన సహాయాన్ని అందించటానికి వెనుకాడకపోవటం. ఇది ఇవ్వడంలో వున్న ఆనందపు మాధుర్యాన్ని చవి చూపిస్తుంది.
5. కష్టాల్లో వున్న వారికి చేయూత నివ్వటం ఎంతో మానసిక సంతృప్తిని అనిర్వచనీయమైన ఆనందాన్ని ఇస్తుంది.
6. సన్నిహితులను వారి లోపాలతో సహా సంపూర్ణంగా స్వీకరించండి. మీతో పాటు మీ పక్కవారు కూడా బాగుంటేనే మీ ఆనందానికి అవరోధాలు చాలావరకు తగ్గిపోతాయి.
7. ప్రతికూల పరిస్థితుల్లోనూ సానుకూల అంశాలకోసం అన్వేషించాలి. అప్పుడే మీలో పరిపూర్ణ ఆనందం అనుభూతిలోకి వస్తుంది.
8. మనం బావుండటమే కాదు ఇతరులు కూడా బాగుండాలని కోరుకోవటంలోనే అసలైన ఆనందం ఇమిడి వుంది.

వీటిలో ఏ ఒక్క సూత్రాన్ని అలవర్చుకునే ప్రయత్నం చేసినా మీ మునుపటి దృక్పధంలో మార్పు వచ్చినట్లే. ఆనందమయ జీవితానికి అంతా మంచే జరుగుతుందనే సద్బావనను పెంపొందించుకోవటమే సులువైన మార్గం.

Share this Story:

Follow Webdunia telugu