Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నవ వధువు నాజూకుగా ఉండాలంటే...

Advertiesment
మహిళ ఉమన్ స్పెషల్ పెళ్లిళ్ల సీజన్ వధువు స్లిమ్ వ్యాయామం బ్యూటీ ప్యార్లల్ జిమ్ కొవ్వు కండరాలు డంబెల్స్
, బుధవారం, 19 నవంబరు 2008 (14:07 IST)
కార్తీక మాసం వచ్చేసింది... మాఘ మాసం కూడా రాబోతోంది. అంటే పెళ్లిళ్ల సీజన్ అని చెప్పక్కర్లేదు కదా. ముందుగా కాబోయే నవవధువులకు అభినందనలు చెబుదాం. మామూలు రోజుల్లో మీరు ఎలా ఉన్నా ఫరవాలేదు. కానీ పెళ్లి రోజు మాత్రం ప్రత్యేకించి నూతన వధువు పెళ్లి మండపంలో దేదీప్యమానంగా మెరిసిపోవలసిందే..

పెళ్లవుతోందన్న సంతోషంతో కాస్త ఎక్కువగా లాగించి బొద్దుగా మారారంటే పెళ్లిమండపంలోనే కామెంట్లు తప్పవు.. పెళ్లి మండపంలో పిప్పిళ్ల బస్తా అనో లేక ఇలాంటి కామెంట్లు వినిపిస్తే, వధువు చెవిన బడితే పరిస్థితి ఘోరంగా ఉంటుంది కదూ.. పైగా వివాహ వేదికపైనే ఒకరి నొకరు చూసుకున్నప్పుడు వధూవరులు ఎంత స్లిమ్‌గా నాజూగ్గా కనిపిస్తే అంత మంచిది.

కాబోయే భార్య ఇలా ఉండాలి అని ఊహించుకునే కాబోయే భర్త పెళ్లి మండపంలోనే వధువును చూసి డంగైపోవాలంటే నూతన వధువు ఎంత నాజూకుగా ఉంటే అంత మంచిది. పైగా వేదికపై తొలిచూపులోనే భావి జీవిత సహచరుడిని దాసోహం చేసుకోవాలంటే వధువు రూపం జగదేక సుందరిని తలపింపజేయాల్సిందే.

వివాహ సమయంలో అపరూప లావణ్య ప్రదర్శనతో మెరిపించాలంటే నూతన వధువులు బ్యూటీ ప్యార్లళ్లకు, జిమ్‌లకు పరుగెత్తనవసరం లేకుండా సింపుల్‌గా ఈ కింది ఎక్సర్‌సైజ్‌లను పాటిస్తే చాలు. మీ కండరాల్లో పేరుకుపోయిన అదనపు కేలరీలను లేదా కొవ్వును ఖర్చు చేసి, కండరాలను దృఢంగా ఉంచడానికి మీక్కావలసినవి ఏవంటే...

2 కిలోలు 3 కిలోల బరువున్న డంబెల్స్ జత
ఒక మ్యాట్
మిమ్ములను మీరు చూసుకునేందుకు ఒక అద్దం

కొవ్వును ఇలా తగ్గించుకోండి..
శరీరంలో చేరిన అదనపు కొవ్వును కాని, కనీస మాత్రపు కొవ్వు పదార్ధాన్ని కాని తొలగించుకోవాలంటే కార్డియోవాస్క్యులర్ వ్యాయామాన్ని ప్రతిరోజూ క్రమం తప్పకుండా కనీసం 30 నిమిషాల పాటు చేయాలి. గుండె పనితీరును, రక్తనాళాలను వేగవంతం చేసేందుకు గాను నడక, ఈత, సైక్లింగ్, ఎరోబిక్స్, కిక్ బాక్సింగ్ వంటి వ్యాయామాల్లో ఏదో ఒకదానిని ఎంచుకుని రోజూ పాటించాలి.

డ్యాన్స్ క్లాసులు వ్యాయమానికి సంకేతాలు కావని గమనించాలి. రోజూ ఒకే విధమైన వ్యాయామం బోర్ కొడుతుంది అనుకుంటే పైన చెప్పిన వాటిలో రోజుకు ఒకటి చొప్పున మార్చి మార్చి చేయవచ్చు. వ్యాయామం ప్రారంభించే ముందు కనీసం అయిదారు నిమిషాలపాటు వామప్ చేయాలి. వ్యాయామం ముగిసిన తర్వాత అయిదారు నిమిషాల పాటు విశ్రాంతిగా ఉండిపోవాలి. ఈ క్రమంలో అప్పుడప్పుడూ కొన్ని స్ట్రెచ్‌లను కూడా వేయాలి. ఇది మీ శరీర పొందికకు చాలా అవసరం కాబట్టి వదిలిపెట్టవద్దు.

ప్రయోజనాలు: క్రమం తప్పకుండా ఈ వ్యాయామాలను చేశారంటే కండరాల్లోని కొవ్వు కరిగిపోతుంది. ఒంట్లో శక్తి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. చర్మానికి కాంతినిస్తుంది. జుట్టు బలంగా నిగనిగలాడుతూ కనిపిస్తుంది. గోళ్లుకూడా పొందికగా మారతాయి.
వీటితోపాటే నడుముకు సంబంధించిన వ్యాయామాలు చేసినట్లయితే మీ కండరాలను బిగుతుగా మార్చి, మీ శరీరా లావణ్యాన్ని, రూపును మెరుగుపరుస్తుంది.

ఈ వ్యాయామానికి గాను మీకు ఏమాత్రం ఖర్చుకాకపోవడం విశేషం. చిన్నపాటి డంబెల్స్ సాయంతో రోజుకు 20 నిమిషాలు మీరు వ్యాయామం చేస్తే చాలు.

Share this Story:

Follow Webdunia telugu