దేశంలో 42.7 మిలియన్ మహిళలు అదృశ్యం: యూఎన్‌డీపీ
, సోమవారం, 8 మార్చి 2010 (19:32 IST)
ఆసియాకు చెందిన ఏడు దేశాలలోని మహిళల్లో దాదాపు వంద కోట్ల మంది మహిళలు అదృశ్యమౌతున్నారని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) సోమవారం వెల్లడించింది. ఇందులో ముఖ్యంగా 85 మిలియన్ మహిళలు భారత్, చైనా దేశాలకు చెందినవారని, వీరిలో 42.7 మిలియన్ మహిళలు భారతదేశానికి చెందిన వారని యూఎన్‌డీపీ న్యూ ఢిల్లీలో పేర్కొంది.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తమ సంస్థ ఈ నివేదికను విడుదల చేసినట్లు సంస్థ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. అదే 2007లో చాలామంది మహిళలు, బాలికలు తప్పిపోవడంతోపాటు పలువురు అనారోగ్య కారణాలరీత్యా సరైన చికిత్స పొందలేక మృతి చెందారని ఆ సంస్థ తెలిపింది. ఆసియాలోని ఏడు దేశాలలో చాలా మంది అమ్మాయిలకు సరైన పోషక పదార్థాలు లభించక, వారిని తుది దశలోనే అంతమొందించారని యూఎన్‌డీపీ తెలిపింది. ఇలా శిశుప్రాయంలోనే తమ ప్రాణాలను పోగొట్టుకున్న ఆడ శిశువులు వంద మిలియన్లుంటారని ఓ అంచనా.
ఆసియాలోని ఏడు దేశాలు భారతదేశం, బంగ్లాదేశ్, చైనా, ఇరాన్, దక్షిణ కొరియా, నేపాల్, పాకిస్థాన్ దేశాలు. అదే భారత్, చైనా దేశాల్లో దాదాపు 85 మిలియన్ మహిళలు తప్పిపోయినట్లు యూఎన్‌డీపీ తన నివేదికలో పేర్కొంది. చైనా దేశంలో 42.6 మిలియన్ మహిళలు తప్పిపోగా అదే భారతదేశంలో 42.7 మిలియన్ మహిళలు, పాకిస్థాన్ దేశంలో 6.1 మిలియన్ మహిళలు తప్పి పోయినట్లు యూఎన్‌డీపీ తెలిపింది.