"ఉమన్ ఆఫ్ ది ఇయర్"గా పాప్ గాయని బియాన్సే...!
ప్రఖ్యాత పాప్ గాయని బియాన్సేను ఈ ఏడాది "ఉమన్ ఆఫ్ ది ఇయర్" అవార్డు వరించింది. సంగీతపరంగానే కాకుండా, సామాజిక సేవా కార్యక్రమాల్లో సైతం పాలు పంచుకున్నందుకుగానూ "బిల్‌బోర్డ్ మ్యాగజైన్" బియాన్సేను ఈ అవార్డుతో సత్కరించనుంది. కాగా.. అక్టోబర్ 2వ తేదీన జరిగే "ఉమన్ ఇన్ మ్యూజిక్" అనే కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు."
ఐయామ్ సషా ఫియర్స్" అనే ఆల్బమ్‌తో సంగీత ప్రియులను ఓలలాడించిన బియాన్సే.. అనేక సామాజిక కార్యక్రమాలను సైతం చేపట్టారు. "జనరల్ మిల్స్ హాంబర్గర్ హెల్పర్ అండ్ ఫీడింగ్ అమెరికా" అనే సంస్థతో కలిసి 35 లక్షల మందికి సరిపోయే ఆహారాన్ని ఫుడ్ బ్యాంకులకు ఆమె అందజేశారు.అంతేగాకుండా.. పేదలు, వికలాంగులకు తన కచేరీ చూసేందుకు వీలుగా 2,500 టికెట్లను ఆమె ఉచితంగా అందించారనీ... కేవలం గాయనిగానే కాకుండా, తన వితరణ కార్యక్రమాల ద్వారా మహిళలకు ఆదర్శప్రాయంగా నిలిచినందుకుగానూ తనను ఈ అవార్డుతో గౌరవిస్తున్నట్లు బిల్‌బోర్డ్ మ్యాగజైన్ ఈ సందర్భంగా బియాన్సేను ప్రశంసల్లో ముంచెత్తింది.