Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉమెన్స్ డే స్పెషల్ : సమాజంతో పోరాడిన ఓ మహిళ... నీకు వందనం.. ఎవరామె..!

కుటుంబాన్ని పోషించడానికి భర్తే అవసరం లేదు. అన్నింటిలో ముందుండే మహిళ తన సంసారాన్ని ఎందుకు చక్కదిద్దుకోలేదు అన్న ఆలోచనే తన తాగుబోతు భర్త నుంచి ఆమెను వేరు చేసింది. ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుందన్న

Advertiesment
ఉమెన్స్ డే స్పెషల్ : సమాజంతో పోరాడిన ఓ మహిళ... నీకు వందనం.. ఎవరామె..!
, బుధవారం, 8 మార్చి 2017 (14:27 IST)
కుటుంబాన్ని పోషించడానికి భర్తే అవసరం లేదు. అన్నింటిలో ముందుండే మహిళ తన సంసారాన్ని ఎందుకు చక్కదిద్దుకోలేదు అన్న ఆలోచనే తన తాగుబోతు భర్త నుంచి ఆమెను వేరు చేసింది. ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుందన్న సూత్రాన్ని గుర్తు తెచ్చుకుని ఎవరి విజయం వెనుకో తాను ఉండటం ఏంటి తనే విజయాన్ని సాధించాలనుకుంది. అందుకు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది. అందరూ ఆశ్చర్యపోయే విధంగా స్వశక్తితో తన ఒక్కగానొక్క కూతుర్ని అల్లారు ముద్దుగా సాక్కుంటూ మహిళా సాధికారతకు నిలువుటద్దంలా నిలుస్తోంది. ఆమె ఎవరో కాదు తిరుపతికి చెందిన కుమారి. మహిళా దినోత్సవం సందర్భంగా కుమారిపై ప్రత్యేక కథనం.
 
మహిళలు ఎందులోనూ వెనుకుబాటుకు గురికాకూడదు. బ్రతుకుతెరువు కోసం మగవారు చేసే ప్రతి పనిని తాను కూడా చేయగలనని ఓ మహిళగా నిరూపించింది కుమారి. అందుకు విభిన్నమైన వృత్తినే ఎన్నుకుంది. ఆటోడ్రైవర్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి జీవితాన్ని కొనసాగిస్తూ కుమారి అకారణంగా చావుకు దగ్గరవుతున్న ఎంతోమంది ఆడవాళ్ళకు ఆదర్శంగా నిలుస్తోంది. 18 సంవత్సరాల క్రితం తిరుపతికి చెందిన ఒక వ్యక్తితో వివాహం చేసుకుంది కుమారి. కానీ భర్తగా ఏరోజు భరోసా ఇవ్వకపోగా ప్రతిరోజు తాగొచ్చి వేధించేవాడు. 
 
అతని వేధింపులు భరించలేక చివరకు విడిపోవాలనుకుంది. అనుకున్నట్లుగానే విడాకులు తీసుకుని వేరుగా బతకాలని నిర్ణయించుకుంది. అయితే ఎవరికి రాని కష్టం తనకే వచ్చిందన్న ఆలోచనతో తన మీద తనకే బతుకుపై ఒకప్పుడు అపనమ్మకం ఏర్పడింది. ఆ కారణంగా చివరకు చావుకు దగ్గరవ్వాలనుకుంది.  
 
కానీ తనకంటే ఎన్నో కష్టాలను అనుభవించి పడిలేచిన కెరటంటా విధికి ఎదురేగిన మహిళలు ఆమె మదిలో మెదిలారు. అప్పటి నుంచి నిర్ణయించుకుంది ఏదైనా బతికే సాధించాలని. ఏ పనిచేయాలో తెలియదు. స్కూలుకు వెళితే ఆ కష్టం తాను చేయలేనని భయపడిపోయింది. 
 
కానీ అప్పటికే తనకు తోడుగా ఉన్న కూతురు భవిష్యత్తును గుర్తు తెచ్చుకుని ఎలాగైనా సంపాదించుకుంది. ఒక ఆటోను తన అక్క సహాయంతో కొనుక్కుని దాని ద్వారా సంపాదన మొదలుపెట్టింది. అలా యేడాది కాదు రెండేళ్ళు కాదు ఏకంగా 11 యేళ్ళుగా విజయవంతమైన జీవితాన్ని గడుపుతుంది ఆమె. తన కూతురు జీవితం తనలాగా కష్టాల పాలు కాకూడదని ఉన్నతంగా చదవి ప్రైవేట్ ఉద్యోగం కూడా తీయించింది. అందరు మహిళలు ఇలాగే ఆలోచిస్తే ఈ గృహహింసలు, ఈ బలవన్మరణాలనేవి ఉండవు. ఆడది అనుకుంటే ఏదైనా సాధించగలదు. ఎలాగైనా తెలిసి నిలబడగలదు అన్న సూత్రాన్ని నిజం చేసిన ఆమెకు మహిళాదినోత్సవం రోజున  సెల్యూట్ చేయాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రౌన్ రైస్ తినండి.. షుగర్‌తో పాటు బరువును కూడా తగ్గించుకోండి