Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గర్భధారణ తర్వాత మహిళలు ఎందుకు స్లిమ్‌గా ఉండరు?

పిల్లల్ని కన్న తర్వాత మహిళలు ఎందుకు స్లిమ్‌గా, నాజూకుగా ఉండలేరు అనేది మహిళలను నిజంగానే భయపెట్టే ప్రశ్న. ఎందుకంటే గర్భధారణము మునుపటి శరీరాకృతి చాలా మంది స్త్రీలకు రాదు. దీనికి కారణం ప్రయత్న లోపమే అంటోంది తాజా అధ్యయనం. గర్భధారణ, ప్రసవం తర్వాత కూడా మీ బ

Advertiesment
గర్భధారణ తర్వాత మహిళలు ఎందుకు స్లిమ్‌గా ఉండరు?
హైదరాబాద్ , శుక్రవారం, 10 మార్చి 2017 (05:33 IST)
పిల్లల్ని కన్న తర్వాత మహిళలు ఎందుకు స్లిమ్‌గా, నాజూకుగా ఉండలేరు అనేది మహిళలను నిజంగానే భయపెట్టే ప్రశ్న. ఎందుకంటే గర్భధారణము మునుపటి శరీరాకృతి చాలా మంది స్త్రీలకు రాదు. దీనికి కారణం ప్రయత్న లోపమే అంటోంది తాజా అధ్యయనం. గర్భధారణ, ప్రసవం తర్వాత కూడా మీ బాడీని నాజూకుగా ఉంచుకోవాలంటే జీవన శైలిని మార్చుకోవలసిందే అంటున్నారు పరిశోధకులు. పిల్లలు తినే బలవర్థక ఆహారాన్ని వదిలేయడం ఇష్టంలేక తల్లులు దాన్ని ఆరగించడం, పిల్లలతో పాటు కూర్చుని అదేపనిగా సినిమాలు చూడటం, పుస్తకాలు చదవుతుండటం కూడా ప్రసవానంతర తల్లులు లావు కావడానికి కారణం అని వీరంటున్నారు.
 
పిల్లలు పుట్టాక, పుట్టక ముందు మహిళల బరువుకు సంబంధించిన తారతమ్యాలపై మిచిగాన్ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ఓల్గా యుకుషెవా చేసిన పరిశోధన కొన్ని దిగ్భాంతిరకమైన వాస్తవాలు వెల్లడించింది. 1 నుంచి నాలుగుసార్ల వరకు ప్రసవించిన 30 వేలమంది మహిళలపై అధ్యయనం చేసిన ఓల్గా దాదాపు వీరెవరూ గర్భధారణకు మునుపటి శరీరాన్ని తిరిగి పొందలేకపోయారని చెప్పారు. పిల్లలు పుట్టిన రెండేళ్ల తర్వాతే వారి శరీరాలు మళ్లీ నాజూకుగా మారే క్రమంలోకి వెళుతున్నాయని ఓల్గా చెప్పారు. 
 
సాధారణంగా ప్రతి ఏటా మహిళల్లో సగటున 1.94 పౌండ్ల బరువు పెరుగుతుంటోంది. కానీ పిల్లలు పుట్టాక వీరిలో అదనంగా ఒక పౌండు బరువు పెరుగుతుంటుంది. దీనికి కారణం పిల్లలు తినగా ప్లేట్లో మిగిలిపోయిన ఆహారాన్ని తల్లి భుజిచడం, పిల్లలతోపాటు చాలా సేపు కూర్చుని పుస్తకం చదవటం, సినిమాలు చూడటం కావచ్చని ఓల్గా తెలిపారు. దీంతో పెరిగిన తమ శరీరాకృతి చూసి బెంగపడే మహిళలు చాలామంది వెంటనే ఆహారం మానేసి, వ్యాయామాల ద్వారా పూర్వ స్థితిలోకి రావాలని ప్రయత్నిస్తారు కాని ఫలితాలు భిన్నంగా ఉండటం చూసి నిరాశ చెందుతారని చెప్పారు.
 
ఇలా నాజూకు శరీరం కోసం సత్వర ప్రయత్నాలు మాని దీర్ఘకాలిక ఆరోగ్యకరమైన జీవన శైలిలను పెంపొందించుకోవాలని ఓల్గా హితవు చెబుతున్నారు. పైగా మాతృత్వం, వయస్సు కారణంగా శరీరంలో పెరిగే బరువును చూసి మహిళలు అపరాధ భావనతో కుమిలిపోకూడదని, వయసు పెరిగే కొద్ది బాడీలో కూడా పెరుగుదల లోని సహజత్వాన్ని అర్థం చేసుకోవాలని ఆమె అంటున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాపీ తాగితే ఉన్న మతి పోదు కానీ వెర్రిని తగ్గిస్తుందట..