Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైట్ డిశ్చార్జ్‌‌ను నిర్లక్ష్యం చేయొద్దు.. వైద్యుల్ని సంప్రదించండి

Advertiesment
Women
రోజుల్లో చాలా మంది స్త్రీలలో తెల్లబట్ట (కుసుమ వ్యాధి) సమస్య బాధిస్తుంది. సుమారు 70 నుంచి 80 శాతం మంది స్త్రీలు ఈ గైనకాలజికల్‌ సమస్యతో బాధపడుతుంటారు. బహిష్టు సమయం తర్వాత కొందరిలో రెండు, మూడు వారాల వరకు, మరికొందరిలో మరల బహిష్టు కనపడే వరకు అప్పుడప్పుడు తెల్లని స్రావాలు కనబడుతూనే ఉంటాయి. 
 
ఈ సమస్య రావడానికి గల ప్రధాన కారణం గర్భకోశంలో గానీ, జననాంగాల్లో ఇన్‌ఫెక్షన్‌కు గురి కావడం. అలాగే అపరిశుభ్రత వల్లే ఇది వస్తుందని చెపుతున్నారు. కొందరు స్త్రీలు ఈ వైట్‌ డిశ్చార్జ్‌ సమస్యను ఎవరికి చెప్పుకోక, వైద్యుల సలహా తీసుకోక నిర్లక్ష్యం చేయడం వల్ల జననాంగాలకు సంబంధించిన రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
ఈ సమస్యతో బాధపడే వారు జననాంగాలలో దురదగా, మంటగా ఉండటం, కొందరిలో ఊరే స్రావాల నుంచి దుర్వాసన కూడా వస్తుంది. నడుం నొప్పి మరియు పొత్తికడపులో నొప్పిగా ఉంటుంది. మానసిక స్థాయిలో చిరాకు, కోపం ఎక్కువగా ఉండును. ఈ సమస్యకు నిపుణులైన వైద్యులను సంప్రదించి తగిన వైద్యం చేయించుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu