Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గర్భిణీలు బ్యూటీపార్లర్లకు వెళ్లి ఏవేవో ఆలోచిస్తే..?

Advertiesment
Facial
గర్భిణీ మహిలలు బ్యూటీపార్లర్లకు వెళ్ళొచ్చా.. ఫేషియల్ వంటివి చేసుకోవచ్చా? అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. కొందరైతే గర్భిణీ మహిళలు ఫేషియల్ చేసుకోకూడదంటారు. కానీ గర్భిణీ మహిళలకు కావాల్సింది మానసిక ప్రశాంతనేనని వైద్యులు అంటున్నారు. ఫేషియల్‌కు మానసిక ప్రశాంతతకు లింకుందంటున్నారు. ఫేషియల్ ద్వారా మైండ్ రిలాక్స్ అవుతుందంటున్నారు. అందుకే గర్భిణీలు ప్రశాంతంగా ఉంటే ఫేషియల్ అవసరం లేదంటున్నారు. 
 
గర్భిణీలు ఫేషియల్ చేసుకునేటప్పుడు మైండ్‌ను రిలాక్స్‌గా ఉంచుకోవాలి. ఫేషియల్ చేసేటప్పుడు ముఖంలో నరాలు మెదడును ప్రభావితం చేస్తాయి. ఫేషియల్ కోసమంటూ బ్యూటీపార్లర్లకు వెళ్లి ఏవేవో ఆలోచనలు చేస్తే మాత్రం ఫలితముండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రిలాక్సేషన్ ఇంట్లో లభించకపోతే మాత్రం ఫేషియల్ చేసుకోవటంలో ఎలాంటి తప్పూ లేదు. ఫేషియల్‌తో మైండ్ రిలాక్సేషన్‌తో పాటు రక్తప్రసరణ క్రమబద్ధం అవుతుంది. మొత్తానికి గర్భిణీలకు ఫేషియల్ మంచి ఫలితాన్ని ఇస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu