ధనవంతులను మాత్రమే స్త్రీలు ఎందుకు ఇష్టపడుతారు?
స్త్రీలు పురుషుల దగ్గర నుంచి ఏమి కోరుకుంటారని అడిగితే ఠక్కున ప్రేమ అని చాలామంది అంటుంటారు. నిజానికి ప్రేమ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. స్త్రీ పురుషుడి దగ్గర నుంచి కోరుకునేది 90 శాతం డబ్బు.
స్త్రీలు పురుషుల దగ్గర నుంచి ఏమి కోరుకుంటారని అడిగితే ఠక్కున ప్రేమ అని చాలామంది అంటుంటారు. నిజానికి ప్రేమ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. స్త్రీ పురుషుడి దగ్గర నుంచి కోరుకునేది 90 శాతం డబ్బు. మహిళలు మొదట డబ్బు, ఆ తర్వాతే దేని గురించైనా ఆలోచిస్తారని నిపుణులు అంటున్నారు. మగవాళ్ల దగ్గర డబ్బులు ఉంటే మహిళ పూర్తిజీవితం మీతోనే సంతోషంగా గడుపుతుంది. కానీ మీరు అదృష్టవంతులు అయితే మంచి మనస్సు ఉన్న అమ్మాయి మీ సొంతమవుతుంది. అసలు మహిళలు ఎందుకు ధనవంతున్ని వివాహం చేసుకోవాలని అనుకుంటారో మొదట తెలుసుకుందాం.
సమాజంలో హోదా కోసం స్త్రీలు ధనవంతులను పెళ్లి చేసుకోవాలని అనుకుంటారట. నిజానికి ఎక్కువ మంది స్త్రీలు భర్తతో కలిగే ఆనందం కంటే సామాజిక హోదాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
ధనం స్త్రీకి భద్రతను కలిగిస్తుంది. చేతిలో డబ్బున్నప్పుడే భవిష్యత్తు సురక్షితం అని ఆమె భావిస్తుందట.
స్త్రీ ధనవంతుల కుటుంబంలోని వ్యక్తిని వివాహం చేసుకుంటే తమ పిల్లల భవిష్యత్తుకు ఎటువంటి ఆటంకం కలగదని భావిస్తుందట.
స్త్రీలను డబ్బు ఒక్కటే ఆకర్షించదు. వారి దృష్టిలో మేధస్సు కూడా ఉంటుంది. స్త్రీలు డబ్బు, మేధస్సు రెండూ ఉన్నవారిని ఇష్టపడతారు.
ఆడంబరమైన జీవితాన్ని పొందేందుకు స్త్రీలు డబ్బు ఉన్న వారిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటున్నారు.