మోనోపాజ్ దశకు చేరుకున్న మహిళల్లో కోర్కెలు ఎక్కువగా ఉంటాయా? సర్వే ఏం చెబుతోంది
సాధారణంగా యుక్త వయస్సు యువతుల్లో కోర్కెలు అధికంగా ఉంటాయని భావిస్తుంటారు. కానీ, టెక్సాస్ యూనివర్శిటీ జరిపిన సర్వేలో మాత్రం ఇది తప్పు అని తేలింది. యుక్త వయస్సులో కంటే.. 30 నుంచి 45 యేళ్ల మధ్యలో ఉండే మహి
సాధారణంగా యుక్త వయస్సు యువతుల్లో కోర్కెలు అధికంగా ఉంటాయని భావిస్తుంటారు. కానీ, టెక్సాస్ యూనివర్శిటీ జరిపిన సర్వేలో మాత్రం ఇది తప్పు అని తేలింది. యుక్త వయస్సులో కంటే.. 30 నుంచి 45 యేళ్ల మధ్యలో ఉండే మహిళల్లో కామ కోర్కెలు అధికంగా ఉంటాయట. అదీ కూడా మోనోపాజ్ దశకు చేరుకున్న మహిళల్లోనే ఇవి అమితంగా ఉంటాయని ఈ సర్వేలో తేలింది. దీనికి కారణం మోనోపాజ్ దశకు చేరుకున్న మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత కారణంగా శృంగార కోర్కెలు తారా స్థాయికి చేరుతాయని, అందువల్లే కోర్కెలు అధికంగా ఉంటాయని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
ఈ వర్శిటీ పరిశోధకులు మోనోపాజ్ దశకు చేరుకున్న 850 మంది పైచిలుకు మహిళలను తమ సర్వే కోసం ఉపయోగించారు. వీరిలో ఎక్కువ మంది ఈ 40 నుంచి 45 యేళ్ల మధ్యలో శృంగార కోర్కెలు అధికంగా ఉన్నట్టు వెల్లడించారు. అలాగే, 35 నుంచి 45 యేళ్లలోపు మధ్యకాలంలోనే శృంగార తృప్తి పొందినట్టు తెలిపారు. అయితే, 34 నుంచి 38 యేళ్ల మధ్యలో ఉండే మహిళలు మరింత తృప్తి పొందినట్టు వెల్లడించారు.