పచ్చి కలబంద వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాత్రమే మనం విన్నాం. అయితే మీరు ఎప్పుడైనా ఎర్ర కలబందను చూసారా? దాని ప్రయోజనాలు మీకు తెలుసా? ఈ రకమైన కలబంద వేడి ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇందులోని ఔషధ గుణాల కారణంగా ఈ ఎర్రని మొక్కను కింగ్ ఆఫ్ అలోవెరా అని పిలుస్తారు.
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	ముఖ్యంగా ఎరుపు రంగు కలబందలో విటమిన్ ఎ, సి, ఇ, బి12, ఫోలిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షిస్తాయి. కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఎరుపు రంగు కలబందలో ఉండే సపోనిన్స్, స్టెరాల్స్ గుండెను రక్షిస్తాయి. రెడ్ కలబందలోని గుణాలను తెలుసుకుందాం.
 
									
										
								
																	
	 
	చర్మం కోసం: ఎరుపు కలబంద అధిక గాఢత కలిగిన జెల్ పొడి చర్మం, ముడతలు, మొటిమలు కోసం ఉపయోగిస్తారు. దాని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మ వ్యాధులను నయం చేస్తుంది. ఇది కాలిన గాయాలు, సోరియాసిస్, కీటకాల కాటు, శిరోజాల ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే కొల్లాజెన్ చర్మాన్ని యవ్వనంగా మార్చుతుంది.
 
									
											
							                     
							
							
			        							
								
																	
	 
	 
	నొప్పి నివారిణి: ఇందులో ఉండే సాలిసిలిక్ యాసిడ్, పాలీశాకరైడ్‌లు కండరాలను సడలించి మంటను తగ్గిస్తాయి. ఇది తలనొప్పి, మైగ్రేన్లకు మంచి ఔషధం. ఇంకా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. టైప్ 2 డయాబెటిస్‌ను దరిచేరనివ్వదు.