Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రాణాయామం - యోగాసనంతో కడుపు నొప్పి వస్తుందా?

సాధారణంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నా... రోజంతా ఉల్లాసంగా ఉండాలన్నా ప్రతిరోజూ క్రమం తప్పకుండా యోగా చేయాలని ప్రతి ఒక్కరూ సలహా ఇస్తుంటారు. అయితే, యోగాసనం నిజానికి బహిష్టు సమయంలో తలెత్తే కడుపు నొప్పి, అధ

ప్రాణాయామం - యోగాసనంతో కడుపు నొప్పి వస్తుందా?
, ఆదివారం, 21 మే 2017 (15:23 IST)
సాధారణంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నా... రోజంతా ఉల్లాసంగా ఉండాలన్నా ప్రతిరోజూ క్రమం తప్పకుండా యోగా చేయాలని ప్రతి ఒక్కరూ సలహా ఇస్తుంటారు. అయితే, యోగాసనం నిజానికి బహిష్టు సమయంలో తలెత్తే కడుపు నొప్పి, అధిక రక్తస్రావంలాంటి సమస్యలకు ఉపశమనం దొరుకుతుంది. పైగా నెలసరి క్రమం తప్పడం ఉండదని విన్నాను. ఇది ఎంతవరకు నిజమో వైద్యులను సంప్రదిస్తే.. 
 
సాధారణంగా యోగాసనాలు చెయ్యడం వల్ల కండరాలు గట్టిపడటం, రక్త ప్రసరణ మెరుగుపడటం, అదనపు కొవ్వు కరగటం, దాని ద్వారా నొప్పి తట్టుకునే శక్తి పెరగడం వంటి ప్రయోజనాలుంటాయి. బరువు నియంత్రణలో ఉండటం వల్ల హార్మోన్ల పని తీరు మెరుగు పడుతుంది. హార్మోన్ల అసమతుల్యత వల్ల ఏర్పడే బ్లీడింగ్‌ సమస్యలు, ఇర్రెగ్యులర్‌ పీరియడ్స్, కడుపులో నొప్పి వంటి ఇతర లక్షణాలు చాలావరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. 
 
యోగాసనాలు ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, వారి బరువు, ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని యోగా నిపుణుల ఆధ్వర్యంలో కొన్ని రోజుల పాటు శిక్షణ తీసుకుని, తర్వాత సొంతంగా ఇంట్లో చేసుకోవచ్చు. రోజు ప్రాణాయామం చెయ్యడం చాలా మంచిది. యోగసాధన చెయ్యడం వల్ల మానసిక, శారీరక ఒత్తిడి తగ్గి, హార్లోన్మ అసమతుల్యత తగ్గి, పీరియడ్‌ సమస్యలు తగ్గే అవకాశాలు ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

4 సింపుల్ నియమాలతో 120 రోగాలు దూరం.. ఏంటవి?