Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫ్రెష్‌గా ఉండాలంటే? నైట్ బ్యూటీ టిప్స్ పాటించండి!

ఫ్రెష్‌గా ఉండాలంటే? నైట్ బ్యూటీ టిప్స్ పాటించండి!
, శనివారం, 30 ఆగస్టు 2014 (18:23 IST)
మీరు వర్కింగ్ ఉమెనా.. తీవ్ర ఒత్తిడితో కూడిన ఆఫీస్ వర్క్ ప్లస్ ఇంటిపనితో అలసిపోతున్నారా.. మరుసటి రోజు ఉత్సాహంగా కనబడలేకపోతున్నారా? అయితే ఈ టిప్స్ ఫాలోకండి. రోజంతా పనిలో మునిగిపోయినా రాత్రి నిద్రించేందుకు ముందు కొన్ని బ్యూటీ టిప్స్ పాటించండి. తద్వారా ఉత్సాహంగా, ఫ్రెష్‌గా ఉండగలుగుతారు. 
 
అవేంటంటే.. ప్రతిరోజూ వివిధ రకాల పనులతో ఇంటా, బయటా ఒత్తిడికి గురవడం ద్వారా చర్మం అలసిపోతుంది. అందుకని చర్మానికి విశ్రాంతి చాలా అవసరం. 
 
* నిద్రలేవగానే ఫ్రెష్ గా కనబడాలంటే మేకప్‌ను రిమూవ్ చేయాల్సిందే. మస్కార, లిప్ కలర్, ఫౌడేషన్ మొత్తాన్ని తొలగించాలి. చర్మం రంధ్రాలు ఫ్రీగా ఉండేలా చూసుకోవాలి. 
 
* రెండు పిల్లోలు ఉపయోగించాలి. తల కొంచెం ఎత్తులో ఉండేలా రెండు దిండులను ఉంచుకోవడం వల్ల ముఖం ఉబ్బుగా లేకుండా ఉంటుంది.
 
* ఫ్యూరిఫైయింగ్ మాస్క్‌తో స్పాట్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. 8 గంటలపాటు నిద్రపోవాలి. కళ్లకింద వలయాలకు చెక్ పెట్టేందుకు ఐ క్రీమ్స్ తప్పకుండా వాడాలి. కళ్ళక్రింద మంచి మాయిశ్చరైజర్‌ను అప్లై చేయాలి. 
 
నిద్రించేందుకు ముందు మంచి న్యాణత కలిగిన ఎక్స్‌ఫ్లోయేట్‌ను అప్లై చేయడానికి ఇది ఒక మంచి సమయం. ప్రతి రోజూ సరిపడా నిద్రపోవడం వల్ల డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. అలాగే నాణ్యత గల హ్యాండ్ క్రీమ్స్ వాడటం ద్వారా మరుసటి రోజు మీరు ఫ్రెష్‌గా కనిపిస్తారని బ్యూటీషన్లు అంటున్నారు.

ఇంకా ఇతర విశేషాలను మీ మొబైల్‌లో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Share this Story:

Follow Webdunia telugu