Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మేనిక్యూర్ చికిత్సతో కోమలమైన చేతులు.. ఎలా?

మేనిక్యూర్ చికిత్సతో కోమలమైన చేతులు.. ఎలా?
, బుధవారం, 13 జనవరి 2016 (08:44 IST)
అతివల బాహ్య సౌందర్యానికి సంబంధించి ముఖంతోపాటు, చేతులకు కూడా అధిక ప్రాధాన్యత ఉంది. చేతులు, అరచేతులు అందంగా ఉండటం అనేది పుట్టుకతో వచ్చే లక్షణాలు. వాటికి మరికొన్ని మెరుగులు దిద్ది సున్నితంగా ఉంచుకుంటే మరింత అందంగా కనిపిస్తాయి. శరీరాంగాలలో ఎక్కువగా పనిచేసేది చేతులతోనే కాబట్టి, వాటికి సాధ్యమైనంత రక్షణ ఇవ్వాలన్నది గుర్తుంచుకోవాలి.
 
కాబట్టి... చేతులు కడిగే ప్రతిసారీ తప్పనిసరిగా టవల్‌తో తుడవాలి. లేకపోతే డీ హైడ్రేషన్ వల్ల చేతులు పొడిబారిపోతాయి. అలాగే తరచుగా గ్లౌజులు ఉపయోగించటం తప్పనిసరి అయితే, ముందుగా చేతులకు పౌడర్ రాసుకుని ఆ తరువాత గ్లౌజులు వేసుకోవాలి. లేదంటే... చెమటవల్ల చేతులు త్వరగా డీ హైడ్రేషన్‌కు గురవుతాయి.
 
బాగా వెలుతురులో కూర్చుని ముందుగా చేతి గోళ్లకు ఉన్న పాత నెయిల్ పాలిష్‌ను రిమూవ్ చేయాలి. దీనికోసం కాస్తంత దూదిని తీసుకుని నెయిల్ పాలిష్ రిమూవర్‌లో ముంచి, ఆ దూదిని గోరుపై ఉంచి తుడిస్తే చెరిగిపోతుంది. తరువాత గోళ్ళను అందంగా ట్రిమ్ చేసుకోవాలి. ఈ సమయంలో ఫైలర్‌ను ముందుకు, వెనుకకు గట్టిగా రుద్దకుండా జాగ్రత్తపడాలి. ఎందుకంటే, అలా చేస్తే గోర్ల అంచులు బలహీనమై త్వరగా పగిలిపోతాయి.
 
ఇలా రెండు చేతులు గోళ్లను ట్రిమ్ చేశాక.. ఒక ప్లాస్టిక్ గిన్నెలో సోప్ వాటర్‌ను పోసి... అందులో హైడ్రోజన్ పెరాక్సైడ్, గ్లిజరిన్, నిమ్మరసం వేసి కలిపి రెండు చేతుల వేళ్ళు మునిగేలా అందులో ఉంచి పదినిమిషాలు అలాగే ఉంచాలి. ఇలా చేయడంవల్ల గోళ్లలో ఉండేటటువంటి మలినాలు, సూక్ష్మజీవులు నశించి రఫ్‌గా, గట్టిగా ఉండే క్యూటికల్స్ మెత్తగా అవుతాయి. గోరుచుట్టూ చర్మం కూడా మెత్తబడుతుంది. ఆ తరువాత రెండు చేతులను తీసి తడిలేకుండా టవల్‌తో తుడుచుకోవాలి.
 
ఇక చివరగా ఒక ఆరెంజ్ స్టిక్‌కు ఒకవైపు దూదిని చుట్టి క్యూటికల్ రిమూవర్‌లో ముంచి దాన్ని గోరుచుట్టూ రాసి, గోరుచుట్టూ కిందకి నొక్కి గట్టిగా తీయాలి. ఇంకా ఏవయినా క్యూటికల్ బిట్స్ మిగిలివుంటే వాటిని కూడా తీసివేయాలి. ఇలా చేయడంవల్ల గోరు పెద్దదిగాను, అందంగాను కనిపిస్తుంది. ఇలా క్రమం తప్పకుండా చేసినట్లయితే.. చేతివేళ్లు, గోర్లు ఆరోగ్యంగా, అందంగా ఉండటమే గాకుండా... చూడగానే ఇట్టే ఆకర్షించేలాగుండే చేతుల సౌందర్యం మీ సొంతమవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu