Publish Date: Wed, 06 Apr 2016 (10:26 IST)
Updated Date: Wed, 06 Apr 2016 (10:31 IST)
పాల గిన్నె అంచులకు కొద్దిగా నూనెరాస్తె పాలు పొంగి బయటకు పోవు. పెరుగు పుల్లగా ఉంటే నాలుగు కప్పుల నీళ్లు పోసి అరగంట తర్వాత ఒంపేయాలి. ఇలా చేస్తే పెరుగులో పులుపు పోతుంది కానీ, నీటితోపాటు పోషకాలు కూడా పోతాయి. అందుకే ఈ నీటికి వృథాగా పారబోయకుండా చపాతీలు కలుపుకోవడానికి వాడుకోవచ్చు. సూప్‌లు, గ్రేవీలు చేసేటప్పుడు సమయానికి క్రీమ్ లేకుంటే దాని బదులుగా పెరుగు, పాలు కలిపిన మిశ్రమాన్ని వాడవచ్చు.
పాల గిన్నె అంచులకు పలుచటి కాటన్ క్లాత్ కట్టి రాత్రంతా ఫ్రిజ్‌లో పెడితే పాలలోని కొవ్వు మొత్తం పైకి తేలి మందపాటి మీగడ పొర తయారవుతుంది. శీతాకాలంలో పెరుగు తయారు కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆ గిన్నెను వేడిగా ఉండే ప్రదేశంలో ఉంచితే పెరుగు గట్టిగా తయారవుతుంది. పెరుగు ఎక్కువ మోతాదులో మిగిలితే ఆ గిన్నె నిండుగా నీళ్లు పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. రోజూ ఆ నీళ్లను మారుస్తూ ఉంటే పెరుగు పుల్లబారకుండా తాజాగా ఉంటుంది.