Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వంట సమయాన్ని ఆదాచేసుకోవడమెలా?

Advertiesment
Kitchen
మిగతా పనుల విషయం ఏమో కానీ వంట విషయంలో ప్లానింగ్‌ లేకపోతే మాత్రం బోలెడు సమయం వృథా అయిపోతుంది. అంతేకాదు ఆఫీసుకి వెళ్లడం కూడా ఆలస్యమవుతుంది. దాంతో చిరాకు, ఒత్తిడి అంతా మన మీద ఒకే సారి దాడిచేస్తాయి. అలాకాకుండా ప్లాన్‌ చేసుకునేందుకు కొన్నిటిప్స్ పాటిస్తే చాలు ఈ సమస్యనుండి బయటపడొచ్చు.
 
అన్ని టైంటేబుల్ ప్రకారమే అన్నిజరగాలంటే కొన్నిసార్లు కుదరకపోవచ్చు. మీరు పెట్టుకున్న సమయానికి కాస్త అటుఇటుగా పని పూర్తయ్యేలా చూసుకోవాలి. ఒక గంటలో వంట పని పూర్తిచేయాలనుకుంటే అందుకు తగ్గట్టుగా ప్లాన్లు చేసుకోవాలి. వీక్లిమెను చార్ట్‌ను మెయింటెయిన్‌ చేయడం వల్ల ప్రతిరోజూ ఏమి వండాలి అని ఆలోచించాల్సిన అవసరం ఉండదు. మెదడుకి కూడా ఎక్కువ శ్రమ లేకుండా పని పూర్తయిపోతుంది. 
 
అంతేకాక సరిపడా కూరగాయలు, వంట సరుకులు ఎప్పుడు నిల్వ ఉంచుకోవాలి. ఈ మధ్య సూపర్‌ మార్కెట్లలో కూరగాయలను కోసి శుభ్రంగా ప్యాక్‌ చేసి అమ్ముతున్నారు. వాటితో ఎంతో సమయం ఆదా అవుతుంది. మీకు తక్కువ సమయం ఉన్నప్పుడు ఈ పద్ధతి  ఉపయోగపడుతుంది.
 
రెడీ టు కుక్‌, రెడీ టు ఈట్‌ వంటి ఆహారపదార్ధాలు ఎప్పుడు వంటగదిలో ఉండాలి. ఎందుకంటే అలసటగా అనిపించినప్పుడు వంట కోసం హైరానా పడాల్సిన అవసరం లేదు. వంట చేయాలనిపించినప్పుడు వీటిని వాడడం చాలా సులభం. సమయం కూడా వృధా కాదు. ఇలా వంట విషయంలో చిట్కాలు పాటించడం వల్ల ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu