Publish Date: Wed, 06 Jan 2016 (12:02 IST)
Updated Date: Wed, 06 Jan 2016 (12:05 IST)
వంటింటి గట్టు, డైనింగ్ టేబుల్‌ని ఉప్పు నీటిలో ముంచిన వస్త్రంతో తుడిస్తే చీమలు, పురుగుల బెడద ఉండదు.
వంటగదిలో మంటలు రేగితే కొద్దిగా సోడా బైకార్బొనేట్ చల్లితే మంటలు, పొగ వ్యాపించకుండా కాపాడుతుంది.
భోజనం చేసిన తర్వాత ఉప్పుతో రుద్ది చేతులు కడుక్కుంటే జిడ్డు వదులుతుంది.
స్టీలు సామాగ్రి కొన్నప్పట్టి మెరుపు ఉండాలంటే రోజూ చింతపండు వేసి తోమాలి.
నువ్వులు త్వరగా పురుగు పడుతుంది. అందుకు నువ్వుల డబ్బాలో నాలుగైదు ఉప్పు గడ్డలు వేస్తే పురుగు పట్టదు.
స్టెయిన్ లెస్ స్టీలు పాత్రలకన్నా అల్యూమినియం పాత్రలు తొందరగా వేడెక్కి వంటకు పట్టే సమయాన్ని తగ్గిస్తాయి.